Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో చేదించింది. 4 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. ఈ విజయం ద్వారా టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లోకి వెళ్లిపోయింది.
Also Read: 2023 లో ఓడించిన బాధ.. అందుకే ఆస్ట్రేలియాపై కేఎల్ రాహుల్ కసిగా ఆడాడా?
బుధవారం న్యూజిలాండ్ – దక్షిణాఫ్రికా (NZ vs SA) మధ్య జరిగే మ్యాచ్లో గెలిచే జట్టుతో భారత్ ఆదివారం తలపడుతుంది. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ 28 పరుగులు మాత్రమే చేశాడు. బంతి అనూహ్యంగా మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ కన్నోల్లీ వేసిన అద్భుతమైన డెలివరీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి 29 బంతులు ఎదుర్కొన్న రోహిత్ మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. రోహిత్ కంటే గిల్(8) డ్వార్ షిష్ బౌలింగ్లో ఇన్ సైడ్ ఎర్జ్ వల్ల క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్, శ్రేయస్ అయ్యర్ నిదానంగా ఆడారు. ఒక్కో పరుగు తీస్తూ స్కోర్ బోర్డును నెమ్మదిగా కదిలించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 91 పరుగులు జోడించారు. ఈ వికెట్ కు ఏర్పరచిన భాగస్వామ్యం టీమిండియా విజయానికి దోహదం చేసింది.
రోహిత్ అరుదైన రికార్డ్
ఈ మ్యాచ్ లో రోహిత్ 28 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.. ఐసీసీ టోర్నమెంట్ల చరిత్రలో తొలి కెప్టెన్ గా నిలిచాడు. రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా వరుసగా నాలుగు ఐసిసి మేజర్ టోర్నీలలో పైనల్ చేరుకుంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వెళ్ళింది. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడి ఓటమిపాలైంది. ఇక అదే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లోకి భారత్ ప్రవేశించింది. మళ్లీ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఇక 2024 లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ లోకి భారత్ వెళ్లింది. దక్షిణాఫ్రికా పై విజయం సాధించి టోర్నీని దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్ వెళ్ళింది. దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. తద్వారా వరుసగా నాలుగు ఐసీసీ మేజర్ టోర్నీలలో జట్టును ఫైనల్ తీసుకెళ్లిన కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.. రోహిత్ ఈ రికార్డు సృష్టించడం ద్వారా అతనిపై అభినందనల జల్లు కురుస్తోంది. “రోహిత్ నాయకత్వంలో టీమిండియా వరుసగా నాలుగు ఐసిసి మేజర్ టోర్నీలలో ఫైనల్ కు వెళ్లింది. ఇది గొప్ప విషయం. అతడి నాయకత్వ ప్రతిభకు నిదర్శనం. అతడు ఇలాగే ఆడాలి. టీమిండియా కు మరిన్ని గొప్ప విజయాలు అందించాలి. అప్పుడే అతడి నాయకత్వ ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: సెంచరీ మిస్ అయినప్పటికీ.. సచిన్ టెండుల్కర్ ను దాటేసిన విరాట్ కోహ్లీ..