Nani : సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో సాధించలేనన్ని విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక హీరో నాని…యంగ్ హీరోలు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో ఆయన సక్సెస్ లను సాధిస్తున్నాడు. మరి ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆయనకు పాన్ ఇండియాలో కూడా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది.
Also Read : అక్షరాలా 400 కోట్లు..దరిదాపుల్లో మరో హీరో లేదు..చరిత్ర సృష్టించిన నాని!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు నాని (Nani)…ఇక ప్రస్తుతం ఆయన వరుసగా మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అల్లరించే ప్రయత్నం చేస్తున్నాడు. సాఫ్ట్ సినిమాలు చేసుకుంటూ వెళ్తే తనకు స్టార్ హీరో ఇమేజ్ రావడం లేదనే ఉద్దేశ్యంతోనే రూటు మార్చు మరి మాస్ సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దసర (Dasara) సినిమాతో మొదలైన ఆయన మాస్ జపం ఇప్పటికి కొనసాగుతూనే వస్తుంది. సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక తొందరలో రాబోతున్న ప్యారడైజ్ సినిమాతో కూడా పెను ప్రభంజనాలను సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ స్టార్ హీరో చేయబోతున్న సినిమాలు ఎలాంటి ఇమేజ్ ను సంపాదించుకుంటాయి. తద్వారా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెడతాయా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఆయన ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆయన తన దృష్టి మొత్తాన్ని ప్యారడైజ్ సినిమా మీదనే పెట్టాడట…మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆ తర్వాత చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారట. ఆయన చేస్తున్న సినిమాలన్నీ తనకు గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టేవి కావడంతో అతను చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలన్నీ ఫ్యామిలీ ప్రేక్షకులు ఆదరించడం వల్లే వచ్చాయి.మరి ప్రస్తుతం ఆయన చేస్తున్న మాస్ సినిమాలకు యూత్ నుంచి మంచి ఆదరణ అయితే దక్కుతుంది. మరి ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో అటు మాస్ ను ఇటు ఫ్యామిలీస్ ని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతానని ఆయన చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న ఒక మాస్ డైరెక్టర్ తో ఆయన సినిమా చేయబోతున్నాడు అని చెబుతున్నాడు. కానీ ఆ డైరెక్టర్ ఎవరు అనేది చెప్పడం లేదు…
మరి ఏది ఏమైనా కూడా ఇక మీదట రాబోయే సినిమాలతో నాని పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి నాని మాస్ హీరోగా మారి స్టార్ హీరోగా మారతాడా? లేదంటే మళ్లీ క్లాస్ సినిమాల వైపే అడుగులు వేస్తాడా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ‘హిట్ 3’ మూవీ సక్సెస్ తర్వాత రెమ్యూనరేషన్ భారీగా పెంచిన నాని…