Nani: రేడియో జాకీ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన నాని(Natural Star Nani), తన జీవితం లో టాలీవుడ్ లోనే టాప్ మోస్ట్ హీరోలలో ఒకడిగా నిలుస్తానని ఊహించి ఉండదు. యాక్సిడెంటల్ గా ‘అష్టాచమ్మా’ చిత్రంతో హీరోగా మారిన ఈయన, ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ‘అంటే సుందరానికి’ చిత్రం వరకు నాని ఒకే రేంజ్ సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ శ్యామ్ సింగ రాయ్ చిత్రం నుండి రూట్ మార్చాడు. తన పరిధిని పెంచుకుంటూ దూసుకుపోయాడు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ ని అందుకొని హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన, రీసెంట్ గా ‘హిట్ 3’ చిత్రం తో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని తన సత్తా చాటాడు.
ఈ నాలుగు సినిమాలకు కలిపి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో మూడు సినిమాలకు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే ‘దసరా’ చిత్రానికి 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, సరిపోదా శనివారం చిత్రానికి వంద కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక హాయ్ నాన్న చిత్రానికి 74 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, రీసెంట్ గా విడుదలైన హిట్ 3 చిత్రానికి 111 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఇంకో పది కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ నాలుగు సినిమాలను కలిపితే 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నాని దరిదాపుల్లో మరో మీడియం రేంజ్ హీరో లేకపోవడం గమనించాల్సిన విషయం.
ఇక ఓవర్సీస్ లో కూడా ఇదే పరిస్థితి, నాని దరిదాపుల్లో మరో హీరో లేదట. దసరా చిత్రానికి రెండు మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లు వస్తే, సరిపోదా శనివారం చిత్రానికి రెండున్నర మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ‘హిట్ 3’ చిత్రానికి 2.2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు రాగా, హాయ్ నాన్న చిత్రానికి 1.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వచ్చింది. అలా ఆయన గత నాలుగు చిత్రాలకు కలిపి నార్త్ అమెరికా లో 8 మిలియన్ల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది కేవలం టీజర్స్ మాత్రమే. వచ్చే ఏడాది మార్చి నెలలో నాని లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల కాబోతుంది. ఈ సినిమా కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండే రెండు మిలియన్ల డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది.