Today horoscope in telugu
‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ఆదిత్య యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణము ఉంటుంది. మిగతా రాశుల వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అయితే ఏదైనా కొత్తగా పనిని ప్రారంభించే వారు ఏకగ్రతతో పూర్తి చేయాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . మీ రాశి వారు ఈ రోజు ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో షాపింగ్ చేసి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు కెరీర్ పై కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనసులో చెడు ఆలోచనలు వస్తే దానిని ఫాలో కావొద్దు. వ్యాపారులకు శత్రువుల బెడద ఉంటుంది. లాభాలు అర్థించడంలో విజయం సాధిస్తారు. సాయంత్రం తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. గతంలో చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. తల్లిదండ్రులతో కలిసి విహారయాత్రాలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఏమైనా వారితో సంతోషంగా ఉంటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . మీ రాశి వారికి ఈ రోజు కొన్ని నిరాశకరమైన వార్తలు వినాల్సి వస్తుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తారు. వ్యాపారులకు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. అయినా వాటిని అధిగమించుకొని చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణము ఉండనుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు రాజకీయ నాయకులు అయితే ఈరోజు వారికి అనుకూలంగా ఉండనుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి శుభ ఫలితాలు ఉంటాయి. సోదరుల మద్దతుతో వ్యాపారులు విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. బ్యాంకు నుంచి రుణం తీసుకుని ప్రయత్నం చేస్తారు. గతంలో అనుకున్న కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులకు అడ్డంకులు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు ఉంటాయి. అప్పులు తిరిగి చెల్లిస్తారు. దీంతో ఆర్థిక భారం కాస్త తగ్గుతుంది. అయితే ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. అయితే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొని పెట్టుబడులు పెడతారు. ఇలాంటి సమయంలో పెద్దల సలహా కావాల్సి ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పాత స్నేహితులను కలుస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండ ఉంటుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారంలో ఈరోజు మంచి ఆదాయాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడడానికి కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. పిల్లలతో కలిసి వ్యార యాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు ప్రశాంతంగా గడుపుతారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులకు కొన్ని పనులు చేయడం వల్ల బిజీగా మారుతారు. అనుకోకుండా డబ్బు ఖర్చు అవుతుంది. అయితే జీవిత భాగస్వామి మద్దతుతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా మారుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. అయితే ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అకస్మాత్తుగా లాభాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే ఏకాగ్రతతో ఉండాలి. సేవ కోసం ఖర్చు చేస్తారు. సమాజంలో గుర్తింపు వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
View Author's Full InfoWeb Title: Today horoscope in telugu 13 may 2025