HIT 3 Movie: ‘సరిపోదా శనివారం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని(Natural star Nani) నటిస్తున్న చిత్రం ‘హిట్ : ది థర్డ్ కేస్'(Hit : The Third Case). నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ ఆయన అభిమానులకు నచ్చి ఉండొచ్చు, బ్లడ్ బాత్ ని ఇష్టపడే యూత్ ఆడియన్స్ కూడా ఇష్టపడి ఉండొచ్చు. కానీ ప్రతీ అంశాన్ని లోతుగా విశ్లేషించేవారికి మాత్రం ఈ టీజర్ నచ్చదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ కత్తి పట్టుకొని ఇష్టమొచ్చినట్టు అడ్డదిడ్డంగా నరకడం ఏమిటి?, ఎక్కడైనా, ఏ సినిమాలో అయినా చూసారా?.. ఈ టీజర్ ని చూస్తున్నంత సేపు అసలు యాక్షన్ జానర్ మూవీ నా?, లేకపోతే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నా? అనేది ఆడియన్స్ కి అర్థం కాలేదు. అత్యంత క్రూరమైన పోలీస్ ఆఫీసర్ అన్నట్టు చూపించారు.
హిట్ 1, హిట్ 2 చిత్రాల్లో హీరోలను ఇంత వయొలెంట్ గా చూపించలేదు. చాలా స్మార్ట్ గా కేస్ ని పరిష్కరించే పోలీస్ ఆఫీసర్స్ గా చూపించారు. హిట్ 2 క్లైమాక్స్ లో కాస్త బ్లడ్ బాత్ ఉన్నింది, కానీ అది సందర్భానికి తగ్గట్టుగానే అనిపించింది. కానీ హిట్ 3 లో మాత్రం ఆ నరకడం ఏందో అసలు అర్థం అవ్వని పరిస్థితి. సినిమాటిక్ లిబర్టీ అనే ముసుగు లో డైరెక్టర్స్ ఈమధ్య ఇష్టమొచ్చినట్టు తీసేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను హాలీవుడ్ యాక్షన్ సినిమాలు బాగా చూస్తాడు అనుకుంట. ఆయన గత చిత్రం ‘సైంధవ్’ లో కూడా హీరో ని ఇలాగే చూపించాడు. నోట్లో గన్ పెట్టి కాలిస్తే క్రింద భాగం నుండి రావడం, ఇష్టమొచ్చినట్టు నరకడం వంటివి వింత వింత యాక్షన్ సన్నివేశాలను అందులో చూపించాడు. కానీ ఆ సినిమాని ఆడియన్స్ అంతగా ఆదరించలేదు.
ఇప్పుడు ఈ చిత్రానికి కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా లో అయితే నెటిజెన్స్ అవసరానికి మించి యాక్షన్ సన్నివేశాలు పెట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా టీజర్ చివర్లో వచ్చే షాట్ కి మాటల్లేవ్..మాట్లాడుకోవడాలు లేవు. చూసే వాళ్ళు ఉన్నారు కదా అని ఇలాంటి సీన్స్ ఎలా రాస్తారో అర్థం కాదంటూ విశ్లేషకులు మండిపడుతున్నారు. సినిమాలో థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ ఉంటే కచ్చితంగా ఈ చిత్రం గత రెండు సినిమాలకంటే పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ లేకుండా కేవలం ఇలాంటి యాక్షన్ సన్నివేశాల మీద మాత్రమే డైరెక్టర్ ద్రుష్టి సారించి ఉండుంటే మాత్రం గట్టిగా మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన తర్వాత నాని నుండి వస్తున్న సినిమా కాబట్టి ఓపెనింగ్స్ వరకు చాలా గట్టిగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.