Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిందో మనమంతా చూసాము. ఈ సినిమా అభిమానులకు ఒక పీడకల. రామ్ చరణ్ మూడేళ్ళ విలువైన సమయం వృధా అయ్యింది అంటూ అభిమానులు ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నారు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని చాలా నిర్లక్ష్య ధోరణితో తీసాడని అందరూ అనుకుంటున్నారు. సినిమా మొత్తం చూసిన తర్వాత పాటలకు పెట్టిన అనవసరపు ఖర్చులో, టాకీ పార్ట్ మీద పెట్టలేదు అనిపించింది. శంకర్ పైత్యం ఏ రేంజ్ లో ఉందంటే, ఒక పాట కోసం ఒక గ్రామం లో ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చి, వాళ్ళు సరిపోకపోవడం తో ఇంకో గ్రామం నుండి జనాలను తీసుకొచ్చి చేయించాడట. ఇంత దూల యవ్వారాలు ఈ కాలం లో ఏ డైరెక్టర్ అయినా చేస్తాడా చెప్పండి. పోనీ వాళ్లకు డబ్బులైనా ఇచ్చారా అంటే అది కూడా లేదట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే గుంటూరుకే, విజయవాడ ప్రాంతాల నుండి హైదరాబాద్ కి దాదాపుగా 350 మందిని ఒక పాట కోసం తీసుకెళ్లారట. వాళ్లందరికీ చెరో 1200 రూపాయిలు చెల్లిస్తామని చెప్పి, ఒప్పందం కూడా చేసుకున్నారట. కానీ సినిమా విడుదలై, థియేటర్స్ నుండి వెళ్ళిపోయి, ఓటీటీ లోకి కూడా వచ్చేసింది. ఇప్పటి వరకు వాళ్లకు ఇస్తామని చెప్పిన డబ్బులు ఇవ్వలేదట. నేడు వీళ్లంతా కలిసి కో డైరెక్టర్ స్వర్గం శివ పై గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. ఆర్టిస్ట్ తరుణ్ అధ్యక్షతన ఈ ఫిర్యాదులు వెళ్లాయి. నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఈ అంశాన్ని గుర్తించి వెంటనే తమకు న్యాయం చేయాలనీ వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. మరి దిల్ రాజు స్పందించి వీళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాడా లేదా అనేది చూడాలి. ‘గేమ్ చేంజర్’ చిత్రం నష్టం చేసినా, దిల్ రాజు ప్రొడక్షన్ నుండి అదే సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్స్ లోనే విజయవంతంగా నడుస్తుంది. రెండు సినిమాలను అన్ని ప్రాంతాల్లో ఒకే డిస్ట్రిబ్యూటర్ కి అమ్మారు కాబట్టి, ఒక్కరికి కూడా నష్టం రాలేదు. అందరూ లాభాల్లోనే ఉన్నారు. కానీ ఇలాంటి చిన్నవాళ్లు మాత్రం అన్యాయం అయిపోతున్నారు. దిల్ రాజు కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు, తెలంగాణ ఫిలిం కార్పొరేషన్ కి చైర్మన్ కూడా. ఆయన వెంటనే స్పందించి వీళ్లకు న్యాయం చేయకపోతే కచ్చితంగా భవిష్యత్తులో ఈ అంశం కారణంగా దిల్ రాజు బాగా నెగటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆయనకు తెలిసి జరిగిందా?, లేక తెలియకుండా జరిగిందా?, తెలియకుండా జరిగితే మాత్రం కో డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ డిమాండ్ చేస్తున్నారు.