Nani: అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన నాని ఆ తర్వాత ‘అష్ట చమ్మ’ సినిమాతో హీరోగా మారాడు… మొదటి సినిమాతోనే న్యాచురల్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అతను సినిమాలను చూసిన ప్రతి ఒక్కరు నాని మన పక్కింటి కుర్రాడిలా ఉన్నాడు అని తనని ఓన్ చేసుకోవడంతో అతని సినిమాలు చూడనికి ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఆసక్తి చూపించారు. ప్రస్తుతం ఆయన మాస్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. గతంలో దసర సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఆ సినిమా ఇచ్చిన బుస్టాప్ తో ఇప్పుడు వరుసగా మాస్ సినిమాల బాట పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో గొప్ప విజయాలను అందుకుంటు ముందుకు సాగుతున్నాడు… ఇక నాని తన ఎంటైర్ కెరియర్ లో ఒక మూడు సినిమాలను మాత్రం మిస్ చేసుకొని చాలా వరకు బాధ పడుతున్నాడనే చెప్పాలి. ఆ మూడు సినిమాలను కనుక చేసినట్లయితే ఆయన ఇప్పటికే స్టార్ హీరోగా అవతరించేవాడని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…
ఇంతకీ ఆ మూడు సినిమాలు ఏంటి అంటే ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘సార్’ సినిమాను మొదట నానితో చేయాలని అతనికి కథను వినిపించాడట. కానీ నాని మాత్రం ఆ స్టోరీ తనకి పెద్దగా నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడు. ఇక ఆ సినిమాను ధనుష్ తో చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు.
అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో హీరోగా వచ్చిన ‘సీతారామం’ సినిమా సైతం మొదట నాని కి చెప్పారట. అంతకుముందే హను దర్శకత్వంలో ‘కృష్ణ గాడి వీర ప్రేమగాదా’ అనే సినిమా చేశాడు. కాబట్టి ఇక ఆ తర్వాత ఆయన పెద్దగా తన టాలెంట్ నిరూపించుకోలేకపోయాడు. దాంతో నాని అతనితో సినిమా చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. వీటితో పాటుగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సినిమా స్టోరీని సైతం మొదట నానికే వినిపించాడు.
ఈ కథని కూడా నాని రిజెక్ట్ చేయడంతో వెంకీ అట్లూరి దిల్కర్ సల్మాన్ తో ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. మొత్తానికైతే నాని ఈ మూడు సినిమాలను కనుక చేసినట్లయితే అతని రేంజ్ మారిపోయి ఉండేదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…