Natural Star Nani : స్టార్ హీరోల సినిమాల ముందు చిన్న హీరోల సినిమాలు నిలబడవు, స్టార్ హీరోల సినిమాలకు చిన్న హీరోల సినిమాలకు కనీసం వారం రోజులైనా గ్యాప్ ఉండాలి. స్టార్ హీరో సినిమా హిట్ అయితే ఆ నెల మొత్తం దరిదాపుల్లో చిన్న సినిమాలను విడుదల చేయకుండా ఉండడం బెటర్. ఇవన్నీ ఒకప్పటి మాటలు. కానీ ఇప్పుడు మాత్రం కంటెంట్ మాత్రమే కింగ్ అని నిరూపిస్తున్నాయి కొన్ని సినిమాలు. కరోనా లాక్ డౌన్ తర్వాత ఇలాంటి ఉదాహరణలు మనం ఎన్నో చూసాము. చెప్పుకుంటూపోతే ఈ ఒక్క స్టోరీ సరిపోదు. అయితే అలాంటి ఉదాహరణే వచ్చే ఏడాది సమ్మర్ లో మరోసారి రిపీట్ కానుందా?, నేడు విడుదలైన నాని(Natural Star Nani) ‘ది పారడైజ్'(The Paradise Movie) మూవీ గ్లిమ్స్ చూసిన తర్వాత అది నిజమే అని అనిపిస్తుంది. చాలా కొత్తగా, విన్నూతన రీతిలో ఈ టీజర్ ఉండడంతో ఫ్యాన్స్, ఆడియన్స్ మెంటలెక్కిపోయారు.
Also Read : జానీ మాస్టర్ తో మాకు ఎలాంటి సంబంధం లేదంటూ మీడియా రిపోర్టర్ పై నేచురల్ స్టార్ నాని ఫైర్!
ఈ చిత్రం కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాదు, ఫారిన్ భాషల్లో కూడా విడుదల కాబోతుంది. నాని తో గతంలో ‘దసరా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తీసిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు. మార్చి 26 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈరోజు విడుదలైన గ్లిమ్స్ ద్వారా చెప్పుకొచ్చారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రం కూడా అదే నెలలో విడుదల కాబోతుందట. మార్చి 26 అంటే విజయదశమి, రంజాన్ వంటి పెద్ద పండుగలు ఉంటాయి. సంక్రాంతి సీజన్ తర్వాత మూవీ మేకర్స్ ఎక్కువగా ఈ సీజన్ పై అమితాసక్తిని చూపిస్తూ ఉంటారు. కనీసం రెండు మూడు సినిమాలైనా పోటీలో ఉంటాయి. చూస్తుంటే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా, అదే విధంగా నాని ‘ది పారడైజ్’ సినిమా ఇదే సీజన్ లో విడుదల అయ్యేలా ఉంది.
ప్రశాంత్ నీల్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ ‘ది పారడైజ్’ సినిమా కాన్సెప్ట్ మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరూ చూడనిది. కాబట్టి కచ్చితంగా ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో ఉండవు అనేది వాస్తవం. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సంగతి పక్కన పెడితే ఇతర రాష్ట్రాల్లో ‘ది పారడైజ్’ చిత్రం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాతో సమానమైన బజ్ ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. పొరపాటున ఎన్టీఆర్ సినిమాకి టాక్ తేడా అయితే, ఇతర రాష్ట్రాల్లో నాని ‘ది పారడైజ్’ సినిమా భారీ మార్జిన్ తో లీడింగ్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈమధ్య కాలం లో ఇలాంటి వింత పరిణామాలు చాలానే చూసాము కాబట్టి, ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : ఆ హీరోతో డేటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్..!