Nani and Anushka Shetty : ఒక పక్క హీరోగా, మరో పక్క నిర్మాతగా వరుస విజయాలను అందుకుంటూ నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ప్రస్తుతం ఎంత మంచి ఊపులో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ ని అందుకున్న నాని, ఈ ఏడాది నిర్మాతగా రెండు భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది మార్చి 14 న కోర్ట్ సినిమాతో నిర్మాతగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న నాని, మే1 హిట్ 3 చిత్రం తో హీరో గా, నిర్మాతగా మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా కెరీర్ పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్న నాని, ప్రస్తుతం దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో ‘ది ప్యారడైజ్’ అనే చిత్రం చేయబోతున్నాడు. వచ్చే నెల నుండి షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకోనుంది ఈ చిత్రం.
Also Read : అక్షరాలా 400 కోట్లు..దరిదాపుల్లో మరో హీరో లేదు..చరిత్ర సృష్టించిన నాని!
ఇదంతా పక్కన పెడితే నాని గతంలో కొన్ని క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా..?. అది కూడా అనుష్క శెట్టి(Anushka Shetty) లాంటి లేడీ సూపర్ స్టార్ తో అద్భుతమైన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని మిస్ చేసుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు, ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), అనుష్క శెట్టి కాంబినేషన్ లో పి. మహేష్ బాబు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా 2023 వ సంవత్సరం లో విడుదలై పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాని ముందుగా నాని తో చేయాలని అనుకున్నాడట డైరెక్టర్. ఆయనకు వెళ్లి స్టోరీ వినిపించగా, ప్రస్తుతం డేట్స్ ఖాళీగా లేవని, ఇప్పుడిప్పుడే ఇమేజ్ ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నానని, ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ గతంలో చేసానని, మళ్ళీ వెనక్కి వెళ్లే ఉద్దేశ్యం లేదని చెప్పాడట.
ఈ చిత్రం కాకపోయినా భవిష్యత్తులో మనిద్దరం కలిసి కచ్చితంగా పని చేద్దామని నాని మహేష్ బాబు తో అన్నాడట. అలా ఈ ప్రాజెక్ట్ నాని నుండి నవీన్ పోలిశెట్టి కి షిఫ్ట్ అయ్యింది. ‘జాతి రత్నాలు’ తర్వాత భారీ గ్యాప్ తీసుకొని నవీన్ పోలిశెట్టి చేసిన చిత్రమిది. ఈ సినిమా ఆయన కెరీర్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా, యూత్ ఆడియన్స్ లో ఆయన క్రేజ్ ని మరింత పెంచింది. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు మోడరన్ ఏజ్ మెగాస్టార్ చిరంజీవి అంటూ నవీన్ పోలిశెట్టి ని పొగడ్తలతో ముంచి ఎత్తారు. ఇక అనుష్క కి అయితే ఈ చిత్రం తన కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇచ్చింది. భాగమతి చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ఇది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపుగా 75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.