Priyanka Chopra: ఈమె ఒక్కొక్క సినిమాకు ప్రస్తుతం రూ.40 కోట్ల పారితోషకం అందుకుంటుంది. స్టార్ హీరోలతో సమానంగా పారితోషకం అందుకుంటున్న ఏకైక హీరోయిన్ ఈమెనే. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇండియన్ సినిమాలలో వరుస అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ చిన్నది టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో కి జోడిగా నటిస్తుంది. ఈ హీరోయిన్ తండ్రి సైనికులకు వైద్యం అందించిన డాక్టర్ గా బాగా ప్రసిద్ధి చెందారు. మోడలింగ్ రంగంలో తన కెరియర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు అందుకుంది. బాలీవుడ్లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బాగా క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ఆ తర్వాత ఈమె హాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకొని హాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
Also Read: అజ్ఞాతంలోకి హీరోయిన్ ఇలియానా..ప్రస్తుతం ఆమె ఎక్కడుందో..ఏమి చేస్తుందో తెలుసా ?
ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు 40 కోట్లు భారీ పారితోషకం అందుకుంటుందని సమాచారం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న ఏకైక హీరోయిన్గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ గ్లోబల్ బ్యూటీ మరెవరో కాదు ప్రియాంక చోప్రా. బాలీవుడ్ సినిమా ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సినిమా ప్రత్యేకతలకు కూడా ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ప్రియాంక చోప్రా సొంతం. ఈమె తండ్రి అశోక్ చోప్రా తల్లి మధు చోప్రా సైన్యంలో డాక్టర్లుగా విధులు నిర్వహించేవారు. ప్రియాంక చోప్రా 18 ఏళ్ల అతి చిన్న వయసులోనే మిస్ ఇండియా పోటీలలో పాల్గొని కిరీటాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆమె హీరోయిన్గా మారాలి అనుకున్నప్పుడు ఆమె తండ్రి ఒప్పుకోలేదట. అయినా కూడా తన తల్లి సహాయంతో ప్రియాంక చోప్రా సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.
మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత ప్రియాంక చోప్రా కు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలో ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఎదిగింది. దాదాపు ప్రియాంక చోప్రా రెండు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీని ఏలింది. ప్రియాంక చోప్రా 2003లో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు ఉన్న విపరీతమైన క్రేజ్ తో హాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంది. ఈ గ్లోబల్ బ్యూటీ ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న SSMB 29 సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు ప్రియాంక చోప్రా ఏకంగా 40 కోట్లు పారితోషకం అందుకుంటుందని సమాచారం.
Also Read: బాలయ్య కాలు తొక్కినందుకు నన్ను సినిమా నుండి పీకేయాలని చూసారు – హీరోయిన్ లయ