https://oktelugu.com/

Hero Nani: ‘సింహంలా ఉన్నావ్​ నాన్న’ అంటూ నానికి కొడుకు బిరుదు.. నెట్టింట్లో వీడియో వైరల్​

Hero Nani: నేచురల్​ స్టార్​ నాని హీరోగా రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్​ సింగరాయ్​. విభిన్న కథాంశంతో ఈ సినిమాను సరికొత్తగా రూపొందించారు దర్శకుడు రాహుల్. ఇందులో నాని డ్యుయర్​ రోల్​లో కనిపించనున్నారు. రెండు వేర్వేరు కాలాలకు సంబంధించిన కథతో ఈ సినిమాను తీశారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. https://twitter.com/NameisNani/status/1472789616855949316?s=20 కాగా, ఈ సినిమాలో సాయిపల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్​లు హీరోయిన్లుగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 20, 2021 / 08:59 PM IST
    Follow us on

    Hero Nani: నేచురల్​ స్టార్​ నాని హీరోగా రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా శ్యామ్​ సింగరాయ్​. విభిన్న కథాంశంతో ఈ సినిమాను సరికొత్తగా రూపొందించారు దర్శకుడు రాహుల్. ఇందులో నాని డ్యుయర్​ రోల్​లో కనిపించనున్నారు. రెండు వేర్వేరు కాలాలకు సంబంధించిన కథతో ఈ సినిమాను తీశారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    https://twitter.com/NameisNani/status/1472789616855949316?s=20

    కాగా, ఈ సినిమాలో సాయిపల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్​లు హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం నాని ఎంత కష్టపడ్డాడో ట్రైలర్​ చూస్తుంటేనే తెలుస్తోంది. డిసెంబరు 24న ఈ సినిమా క్రిస్మస్​ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, చాలా గ్యాప్​ తర్వాత నానికి తీరిక దొరికినట్లుంది.. ఈ క్రమంలోనే తన సతీమణి అంజన, కొడుకు అర్జున్​ (జున్ను)తో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా, తన కుమారుడు జున్నుతో ఆడుకుంటున్న ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు నాని.

    ఇందులో తన తండ్రి మీసాలను మెలితిప్పుతున్న అర్జున్​ను చూసి నా పేరు ఏంటో తెలుసా? అని అడుగుతాడు నాని. అప్పుడు అర్జున్​ శ్యామ్​ సింగరాయ్ అని నవ్వుతూ అంటాడు. తర్వాత సింహంలా ఉన్నావ్ నాన్న అంటూ మళ్లీ మీసాలు తిప్పుతాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ఈ క్రమంలోనే తండ్రీ కొడుకుల ప్రేమను చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు.