Actor Nithin: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం “పుష్ప”. పాన్ ఇండియా తరహాలో ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాని నిర్మించారు. “పుష్ప ది రైజ్ “పేరుతో భారీ అంచనాలతో ఈ నెల 17న విడుదలైన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మూడు రోజులకు గానూ ఈ సినిమా ఏకంగా రూ. 173 కోట్ల పైగానే గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డును సృష్టించింది.

అయితే సినిమా విడుదలైన దగ్గర నుండి టాలీవుడ్ ప్రముఖులంతా మూవీని ప్రశంసిస్తున్నారు. అందులో బన్నీ పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉండటంతో సినీ తారలు నుండి అభిమానులు వరకు అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా “పుష్ప” చిత్రాని వీక్షించిన యంగ్ హీరో నితిన్ … పుష్ఫ సినిమా గురించి అలానే అల్లు అర్జున్ నటన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
నితిన్ చేసిన ట్వీట్ లో…. “పుష్ప” లో అల్లు అర్జున్ డార్లింగ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. “పుష్ప” అంటే ఫైర్ కాదు.. అల్లు అర్జున్ అంటే ఫైర్. ఈ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేశాను. సుకుమార్, రష్మికా, డియస్పీకి.. ఇంకా సినిమా టీమ్ కు అభినందనలు’ అంటూ అల్లూ అర్జున్ ను తను హగ్ చేసుకొన్న ఫోటోను షేర్ చేశాడు నితిన్. ఈ ఏడాదిలో రంగ్ దే, మాస్ట్రో వంటి చిత్రాలతో మంచి విజయం అందుకున్నారు. ప్రస్తుతం నితిన్ ఎమ్ ఎస్ రాజా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజక వర్గం’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు.
PUSHPA!! knock out performance by @alluarjun darling!!
Pushpa ante fire kadhu
@alluarjun ante FIRE 🔥
Thoroughly enjoyed the film!! Congratulations sukumar garu @iamRashmika @ThisIsDSP and to the entire team of PUSHPA pic.twitter.com/kpyaZmQ7jV— nithiin (@actor_nithiin) December 19, 2021