Nani
Nani : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ని నిన్న మొన్నటి వరకు మీడియం రేంజ్ క్యాటగిరీ కి సంబంధించిన హీరోగానే చూసేవారు ట్రేడ్ పండితులు. కానీ అదంతా గతం, ఇప్పుడు నాని రేంజ్ స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదని అంటున్నారు. సినిమా సినిమాకు ఆయన గురి చూసి టార్గెట్ ని కొడుతూ, తన మార్కెట్ పరిధి ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే నాని కెరీర్ ని ‘దసరా’ కి ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. ‘దసరా’ ముందు వరకు కూడా ఆయన కేవలం మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చాడు. అ తర్వాత ‘హాయ్ నాన్న’ లాంటి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా చేసినప్పటికీ, ఆ తర్వాత ‘సరిపోదా శనివారం’ చిత్రం తో అవలీలగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు.
Also Read : 100% స్ట్రైక్ రేట్ విషయంలో పవన్ ని దాటేసిన నేచురల్ స్టార్ నాని!
ఇలా క్రమంగా ఆయన తన పరిధి ని పెంచుకుంటూ పోవడంతో ఆయన సినిమాలకు బిజినెస్ కూడా బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన చేతిలో ‘హిట్ 3′(Hit : The Third Case),’ది ప్యారడైజ్'(The Paradise) వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు ఆయనే నిర్మాత. ‘హిట్ 3’ చిత్రం చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని మే 1 న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ‘ప్యారడైజ్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 26 న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలకు నెట్ ఫ్లిక్స్ సంస్థ క్రేజీ డీల్ తో నాని ముందుకొచ్చింది. హిట్ 3 చిత్రాన్ని 53 కోట్ల రూపాయలకు, అదే విధంగా ప్యారడైజ్ చిత్రాన్ని 75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందట. మరి నాని ఈ క్రేజ్ డీల్ కి ఒప్పుకుంటాడో లేదో తెలియదు కానీ, ఒప్పుకుంటే మాత్రం బీభత్సమే అనొచ్చు. కేవలం పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే ఈ రేంజ్ డీల్స్ వస్తుంటాయి.
నాని గత రెండు చిత్రాలకు కూడా ఓటీటీ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘హాయ్ నాన్న’ చిత్రం దాదాపుగా 8 వారాలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ని చూసే నెట్ ఫ్లిక్స్ సంస్థ నాని సినిమాలను కొనుగోలు చేసేందుకు అమితాసక్తిని చూపిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే, ఇక నుండి విడుదల అవ్వబోయే నాని సినిమాలకు ఓటీటీ లో వంద కోట్ల రూపాయిల రేంజ్ లో రైట్స్ పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేవలం నాని హీరోగా నటించే సినిమాలకు మాత్రమే కాదు, ఆయన నిర్మాతగా వ్యవహరించే సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘కోర్ట్’ చిత్రానికి కూడా మతిపోయే రేంజ్ లో ఓటీటీ రైట్స్ ని డిమాండ్ చేస్తున్నట్టు టాక్.
Also Read : పావలా పెట్టుబడికి రూపాయి లాభం… హీరో నాని పెద్ద ముదురు బాబోయ్!