https://oktelugu.com/

Lord Shani: ఇలాంటి వారిని శనీశ్వరుడు అస్సలు విడిచిపెట్టడు..

శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ మనుషులు చేసే తప్పులకు శని దేవుడు శిక్షలు వేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మనసులు అష్ట కష్టాలు పడుతుండగా.. తమకు శని పట్టిందని బాధపడుతూ ఉంటారు.

Written By: , Updated On : March 18, 2025 / 05:48 PM IST
Lord Shani

Lord Shani

Follow us on

Lord Shani: శనీశ్వరుడు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ మనుషులు చేసే తప్పులకు శని దేవుడు శిక్షలు వేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మనసులు అష్ట కష్టాలు పడుతుండగా.. తమకు శని పట్టిందని బాధపడుతూ ఉంటారు. అయితే మనుషులు చేసే పనుల వల్లే శని పీడ ఉంటుందని జాతక శాస్త్రం తెలుపుతుంది. పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలం ఆధారంగా లేదా ఈ జన్మలో చేసిన పాపాలను బట్టి శనీశ్వరుడు వారిని కష్టపెడతారని చెబుతోంది. అయితే శనీశ్వరుడు ఊరికే ఎవరిని కష్టపెట్టడు. వారు చేసే పనులతోనే వారికి ఫలాన్ని అందిస్తాడు. ఎటువంటి సమయంలో శనీశ్వరుడు వారిని కష్టపెడతారు? వాటి పరిహారానికి ఏం చేయాలి?
మహాశివుడు అంతటి దేవుడినే శనీశ్వరుడు భయపెట్టాడని కొన్ని కథలు చెబుతున్నాయి. అలాంటి శని మనుషుల విషయంలో ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనుషులు తమ కష్టాలను తామే సృష్టించుకుంటారని జాతక శాస్త్రం తెలుపుతుంది. కొందరు ఇతరుల పనులకు ఆటంకాలు సృష్టించడం.. వారిని తప్పుదోవ పట్టించడం.. వారిని ఎప్పుడూ తిడుతూ ఉండడం వల్ల పాపాలను మూటగట్టుకుంటారని పండితులు చెబుతున్నారు. ఇలాంటి వారికి శనీశ్వరుడు శిక్షలు విధిస్తాడని చెబుతున్నారు. అలాగే దుబారా ఖర్చులకు అప్పులు చేయడం, అక్రమంగా డబ్బు సంపాదించడం.. దుబారా ఖర్చులు చేయడం.. డబ్బు కోసం తప్పుడు పనులు చేయడం.. ఒక పని కోసం ఎదుటివారిని వంచించడం.. వంటి పనులు చేయడం వల్ల శనీశ్వరుడు వారి వెంటే ఉంటారని అంటున్నారు.
అయితే కొందరు తమకు తెలియకుండా చాలా తప్పులు చేస్తారు. ఇలాంటి తప్పులకు కూడా శిక్షలు తప్పవు. అయితే వీటినుంచి తప్పించుకోవడానికి ఆధ్యాత్మిక వాతావరణంలో వెళ్లాలి. అంటే శనీశ్వరుడి అనుగ్రహం పొందడం వల్ల ఇలాంటి కష్టాల నుంచి బయటపడవచ్చు. ఇందుకోసం శనికి ఇష్టమైన శనివారం రోజున ఆ స్వామికి ప్రత్యేక పూజలు చేయాలి. శనీశ్వరుడికి ఇష్టమైన తైలంతో అభిషేకం చేయాలి. అలాగే ఈరోజు నల్ల నువ్వులతో శనీశ్వరుడికి పూజలు చేయాలి. నల్ల బట్టలను సమర్పించాలి. నవధాన్యాలతో నవగ్రహ పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో అకారణంగా వచ్చిన దోషాలను తొలగించుకోవచ్చు. వీటితోపాటు రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శనీశ్వరుని బాధ నుంచి కాస్త ఉపశమనం పొందొచ్చు.
ఇలా చేయడంతో పాటు కొన్ని రోజులు ప్రత్యేకంగా ఆలయాలను సందర్శిస్తూ ఉండాలి. ముఖ్యంగా శివాలయాలతో పాటు వైష్ణవాలయాలను సందర్శించడం వల్ల శనీశ్వరుడు బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఇలా చేస్తూనే మరోసారి తప్పుడు మార్గం లో వెళ్లకుండా ఉండాలి. ఓవైపు పూజలు చేస్తూ మరోవైపు తప్పులు చేయడం వల్ల శనిపీడ ఎప్పటికీ వదిలిపెట్టకుండా ఉంటుంది. వేరే జన్మలో చేసిన తప్పులకు ఈ జన్మలో అనుభవిస్తున్న వారు.. ధర్మ మార్గంలో నడుస్తూ ఉండాలి. అప్పుడే శని బాధల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా మిగతా వారిని కూడా సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. దీంతో శని దేవుడు సంతోషించి వారిని చల్లని చూపుతో చూస్తాడని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది.