హైదరాబాద్ అంటే ఎందుకంత నిర్లక్యం!

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం పై కేసీఆర్ సర్కార్ వెనక్కి తగ్గింది. కంటైన్‌ మెంట్ జోన్లలో మాత్రమే లాక్‌ డౌన్ అమల్లో ఉంటుందంటూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన అన్‌ లాక్-2 మార్గదర్శకాలకు అనుగుణంగా చేయడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రమంతటా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాస్తవానికి జూలై 2 కేసీఆర్ […]

Written By: Neelambaram, Updated On : July 3, 2020 4:18 pm
Follow us on


తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం పై కేసీఆర్ సర్కార్ వెనక్కి తగ్గింది. కంటైన్‌ మెంట్ జోన్లలో మాత్రమే లాక్‌ డౌన్ అమల్లో ఉంటుందంటూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన అన్‌ లాక్-2 మార్గదర్శకాలకు అనుగుణంగా చేయడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రమంతటా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వాస్తవానికి జూలై 2 కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్‌ లో లాక్‌ డౌన్ విధించే విషయమై నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరిగింది. హైదరాబాద్‌ లో లాక్‌ డౌన్ విధిస్తారనే ప్రచారం జరగడంతో నగరవాసులు అప్రమత్తమయ్యారు. చాలా మంది తమ సొంతూళ్ల బాట పట్టారు. దీంతో హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముందు జాగ్రత్తగా ఇంట్లోకి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేశారు. అయితే ప్రభుత్వం ఆలోచన మారడానికి చాలా కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినా, విధించకపోయినా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది.