https://oktelugu.com/

Nandita Swetha: ఒక్క చూపుతోనే ఆకట్టుకునే నందితా శ్వేతా.. లేటెస్ట్ ఫిక్స్ వైరల్

తెలుగుతో వరుస సినిమాలు చేస్తూ నందిత శ్వేతా బిజీ అయిపోయారు. కల్కి, బ్లఫ్ మాస్టర్, శ్రీనివాస కల్యాణం, ప్రేమకథా చిత్రం-2 వంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న హిట్ ను అందులేకపోయాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 19, 2023 / 12:44 PM IST

    Nandita Swetha

    Follow us on

    Nandita Swetha: తెలుగు చిత్ర పరిశ్రమలో కథనాయకగా పేరుగాంచిన ‘నందిత శ్వేతా’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ హీరోగా నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నావాడా’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేశారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న నందిత శ్వేత టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.

    తెలుగుతో వరుస సినిమాలు చేస్తూ నందిత శ్వేతా బిజీ అయిపోయారు. కల్కి, బ్లఫ్ మాస్టర్, శ్రీనివాస కల్యాణం, ప్రేమకథా చిత్రం-2 వంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న హిట్ ను అందులేకపోయాయి. అయితే తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు. ఆమె నటనకే కాదు ఆమె నవ్వుకు సైతం పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద కళ్లతో కనిపించే నందిత శ్వేతా తన చూపులతో, అందమైన నవ్వుతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

    తెలుగులో నందిత నటించిన తాజా చిత్రం హిడింబ. ఇందులో గత చిత్రాలకు భిన్నంగా గ్లామర్ డోస్ పెంచడంతో పాటు డేరింగ్, డాషింగ్ ను తలపించేవిధంగా పోలీస్ అధికారి పాత్రలో తనదైన మార్క్ ను మరోసారి వేశారు. అయితే మామూలుగా వెండితెరపై హీరోయిన్స్ పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల నందితా శ్వేత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని చెప్పుకోచ్చారు. ఫైబ్ ఓ మయాల్జియా అనే ఆరోగ్య సమస్య కారణంగా ఆమె ఇబ్బంది పడుతున్నారట. కండరాలతో పాటు వెన్నెముకకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్యతో బాధపడే వారు ఎక్సర్ సైజులు వంటివి చేయకూడదు. అయితే ఆ సమస్యను సైతం పక్కన పెట్టిన నందిత శ్వేతా హిడింబ సినిమా కోసం మాత్రం దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడ్డారు. ఆమె పడిన కష్టాన్ని బట్టి చెప్పుకోవచ్చు సినిమా మీద నందితా కు ఉన్న శ్రద్ధ ఏంటి అనేది అర్థం అవుతుంది.

    వరుస సినిమాలతో బిజీగా ఉన్న నందితా శ్వేత సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే కనిపిస్తారు. లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు నెటిజన్లు, అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.తాజాగా ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలతో అభిమానులను మరోసారి ఆకర్షించారు.