INDIA Alliance : ఈరోజు ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. మరి పార్లమెంట్ లో వచ్చిన ఐక్యత కూటమి సమావేశాల్లో వస్తుందా? అన్నది అందరిలోనూ తొలుస్తున్న ప్రశ్న. నితీష్ కుమార్ కోరినట్టుగా ఇండియా కూటమిలో ఒక సీటు ఒక్కరికే అని.. ఏదైనా ఒక్క పార్టీకే ఆ సీటు దక్కాలని ఒప్పందం చేసుకుంటారా? అన్నది ఇక్కడ ప్రశ్న. చేసుకున్నప్పుడు ఇండియా కూటమి అన్నది పోటీలో ఉంటుంది.2024లో ఇలా చేయకపోతే పోటీలోనే ఉండదు..
యూపీఏ కూటమి ఇండియా కూటమిగా మారగలదా? అన్నది ఇక్కడ ప్రశ్న. పేరు మారింది తప్పితే దానికి సంబంధించిన భూమిక మారలేదు. మనకు ‘బీహార్’ తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఈ రాష్ట్రాలు అన్నింటిలో ఇండియా కూటమిలో మొదటి నుంచే ఈ పార్టీలు ఉన్నాయి. కొత్తగా ఇండియా కూటమి ఏర్పాడ్డాక వచ్చిన పార్టీలు కావు ఇవీ.. ఈ కూటమిలో అంతకుముందే ఈ పార్టీలన్నీ ఉన్నాయి.
ఇండియా కూటమి ఏర్పడ్డాక అసలు ఇండియా కూటమికి గ్రౌండ్ లెవల్లో భూమిక ఎక్కడ ఉంది?ఎందుకంటే యూపీఏలో ఉన్నవే ఇప్పటికీ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ అవే పార్టీలతో అవే పొత్తులు ఉన్నాయి. అది యూపీఏ కూటమి.. ఇండియా కూటమిలో ఉత్తరప్రదేశ్, బెంగాల్, కేరళ, పంజాబ్ లలో ఒప్పందం కుదరాలి..
ఇండీ కూటమి ఐక్యత కేవలం పార్లమెంటు లోపల నేనా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.