https://oktelugu.com/

Nandamuri Mokshajna Teja : రేర్ రికార్డుని నెలకొల్పిన నందమూరి మోక్షజ్ఞ తేజ..బహుశా ఈ రికార్డుని భవిష్యత్తులో ఎవరూ బ్రేక్ చేయలేరేమో!

మొదటి సినిమాతోనే నేటి తరం స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్ ఈ చిత్రానికి రావొచ్చు. అదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే మోక్షజ్ఞ ఎవరికీ సాధ్యం కానీ అరుదైన రికార్డు ని నెలకొల్పబోతున్నాడు. అదేమిటంటే ఆయన 30 ఏళ్ళ వయస్సులో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నాడు అట.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 6:27 pm
    Nandamuri Mokshajna Teja

    Nandamuri Mokshajna Teja

    Follow us on

    Nandamuri Mokshajna Teja :  నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్ర సమయం రానే వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో ఈ నందమూరి కుర్రాడు ఇండస్ట్రీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఇటీవలే విడుదల చేసారు. దీనికి ఫ్యాన్స్ నుండి మాత్రమే కాదు, ఆడియన్స్ నుండి కూడా బంపర్ రెస్పాన్స్ వచ్చింది. నందమూరి వారసుడి సినిమా కాబట్టి ఓపెనింగ్స్ కళ్ళు చెదిరే రేంజ్ లోనే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. మొదటి సినిమాతోనే నేటి తరం స్టార్ హీరోలతో సమానమైన ఓపెనింగ్ ఈ చిత్రానికి రావొచ్చు. అదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే మోక్షజ్ఞ ఎవరికీ సాధ్యం కానీ అరుదైన రికార్డు ని నెలకొల్పబోతున్నాడు. అదేమిటంటే ఆయన 30 ఏళ్ళ వయస్సులో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టబోతున్నాడు అట.

    ఈ సినిమా విడుదల అయ్యేలోపు ఏడాది సమయం పడుతుంది, అంటే తన 31 వ సంవత్సరంలో వెండితెర మీద మోక్షజ్ఞ కనిపించబోతున్నాడు అన్నమాట. ఇది ఒక రికార్డుగా చెప్తున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు ప్రతీ హీరో 20 ఏళ్ళ వయస్సులో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే 17 ఏళ్లకే హీరో అయిపోయాడు. ఇండస్ట్రీ లోకి వచ్చిన రెండేళ్లలోనే మాస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 19 ఏళ్ళ వయస్సులో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మొదటి చిత్రం ‘గంగోత్రి’. అంతకు ముందు ఆయన చిరంజీవి ‘డాడీ’ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర కూడా పోషించాడు. బాలనటుడిగా ‘స్వాతి ముత్యం’, ‘విజేత’ వంటి సినిమాల్లో కూడా ఆయన నటించాడు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తనకి 22 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు ‘చిరుత’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసాడు, ఈ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి తో ‘మగధీర’ చిత్రం చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టి స్టార్ హీరోగా మారిపోయాడు. రెబెల్ స్టార్ ప్రభాస్ 21 వ ఏటా ఇండస్ట్రీ లోకి ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు, రెండవ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది, మూడవ సినిమా ‘వర్షం’ మాత్రం సూపర్ హిట్ గా నిలిచి ప్రభాస్ ని స్టార్ గా మలిచింది. ఇప్పుడు ఆయన ఏ స్థాయిలో ఉన్నదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

    బాలనటుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మహేష్ బాబు తనకు 24 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు ఇండస్ట్రీ లోకి ‘రాజకుమారుడు’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి లాగానే సూపర్ స్టార్ అయ్యాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తనకి 28 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు ఇండస్ట్రీ లోకి ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రం తో అడుగుపెట్టాడు, ఇప్పుడు పవర్ స్టార్ రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాలా?, అటు సినిమాల్లోనూ, ఇటు పాలిటిక్స్ లోను సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. అలా హీరోలందరూ ఇంత చిన్న వయస్సులో సినీ రంగంలోకి అడుగుపెడితే, మోక్షజ్ఞ మాత్రం 30 ఏళ్ళ వయస్సులో అడుగుపెడుతున్నాడు, మరి ఈయన భవిష్యత్తు ఏమిటో చూడాలి.