https://oktelugu.com/

Nandamuri Kalyan Ram : ‘తెలుగు దేశం’ జెండా పట్టుకున్న నందమూరి కళ్యాణ్ రామ్..వీడియో వైరల్!

Nandamuri Kalyan Ram : చాలా కాలం నుండి తెలుగుదేశం పార్టీ(TDP Party) ఎన్టీఆర్(Junior NTR), కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) లను దూరం పెట్టాలని చూస్తుంది, అన్నదమ్ములు కూడా పార్టీ కి చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు అంటూ మీడియా లో ప్రచారం జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

Written By: , Updated On : April 1, 2025 / 09:16 AM IST
Nandamuri Kalyan Ram

Nandamuri Kalyan Ram

Follow us on

Nandamuri Kalyan Ram : చాలా కాలం నుండి తెలుగుదేశం పార్టీ(TDP Party) ఎన్టీఆర్(Junior NTR), కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) లను దూరం పెట్టాలని చూస్తుంది, అన్నదమ్ములు కూడా పార్టీ కి చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు అంటూ మీడియా లో ప్రచారం జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఇంటర్వ్యూ లో కళ్యాణ్ రామ్ ని అప్పట్లో తెలుగు దేశం పార్టీ కి సపోర్ట్ చేస్తారా అని అడిగినప్పుడు, ఇంట్లో చర్చించుకొని నిర్ణయం తీసుకుంటాం అంటూ సమాధానం ఇచ్చి అందరిని షాక్ కి గురి చేశాడు. బాలయ్య కూడా జూనియర్ ఎన్టీఆర్ ని బహిరంగంగానే దూరం పెట్టేసిన సందర్భాలను మనం ఎన్నో చూసాము. కానీ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను చూస్తుంటే, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు టీడీపీ తో దూరం తగ్గిందని, త్వరలోనే వీళ్లిద్దరు టీడీపీ లో క్రియాశీలకంగా పని చేస్తారని టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ నిన్న జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియా లో ఆసక్తికరంగా మారింది.

Also Read : ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ గా నందమూరి కళ్యాణ్ రామ్..స్టోరీ లైన్ మామూలుగా లేదుగా..నందమూరి ఫ్యాన్స్ కి పండగే!

పూర్తి వివరాల్లోకి వెళ్తే కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమా ‘అర్జున్ s/o వైజయంతి’ కి సంబంధించిన ప్రొమోషన్స్ కోసం ఆంధ్ర ప్రదేశ్ కి విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కళ్యాణ్ రామ్ ఒక టీడీపీ జెండా ని చూసి, ఆ జెండా ని పట్టుకొని పట్టుకున్న తెలుగు దేశం కార్యకర్తను దగ్గరకు పిలిచి, కార్యకర్త చేతిలో ఉన్న జెండాని తన చేతుల్లోకి తీసుకున్న వీడియో సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. ఎవరైనా చేతికి ఇస్తే తీసుకోవడం వేరు, తన అంతటా తానే అడిగి మరీ తీసుకోవడం వేరు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ సంఘటన పెద్ద చర్చలకు దారి తీసింది.

వారం రోజుల క్రితం నారా లోకేష్(Nara Lokesh) కూడా ఇలాంటి పనే చేశాడు. అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ని చేతిలో పెట్టుకొని ఉండడాన్ని చూసి, దానిని తన చేతుల్లోకి తీసుకొని అభిమానులందరికీ చూపించాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నారా లోకేష్ అలా చేశాడు కాబట్టే, దానికి బదులుగా కళ్యాణ్ రామ్ ఇలా చేశాడా?, లేదా నిజంగానే మనస్ఫూర్తిగా చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే కళ్యాణ్ రామ్, సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayasanthi) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అర్జున్ s/o వైజయంతి'(Arjun S/o Vyjayanthi) చిత్రం ఈ ఏడాది జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇది వరకే విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంది.

Also Read : వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్… కళ్యాణ్ రామ్ కెరీర్ మళ్ళీ మొదటికి!