https://oktelugu.com/

Nandamuri Hero: సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నందమూరి హీరో

Nandamuri Hero: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి ఫామిలీ కి ఉన్న ప్రత్యేకమైన స్థానం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అటు సినిమాల పరంగా ఇటు పాలిటిక్స్ పరంగా సృష్టించిన ప్రభంజనం ని తెలుగు జాతి బ్రతికి ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకుంటుంది..అలంటి ఫామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చిన బాలయ్య బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశ ఖ్యాతిని మరింత పెంచారు..ఇక వీళ్ళని చూసి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 28, 2022 / 07:35 PM IST

    Nandamuri Hero

    Follow us on

    Nandamuri Hero: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి ఫామిలీ కి ఉన్న ప్రత్యేకమైన స్థానం ఎలాంటిదో మన అందరికి తెలిసిందే..మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అటు సినిమాల పరంగా ఇటు పాలిటిక్స్ పరంగా సృష్టించిన ప్రభంజనం ని తెలుగు జాతి బ్రతికి ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకుంటుంది..అలంటి ఫామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చిన బాలయ్య బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశ ఖ్యాతిని మరింత పెంచారు..ఇక వీళ్ళని చూసి ఇండస్ట్రీ లోకి వచ్చిన మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ పర్వాలేదు అనే రేంజ్ లో ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వగా, నందమూరి తారకరత్న మాత్రం ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేకపోయారు..ఈయన నటించిన సినిమాలు ఒక్కటి కూడా సక్సెస్ కాలేకపోయాయి..కనీసం క్యారక్టర్ ఆర్టిస్టు గా కూడా తారకరత్న సక్సెస్ సాధించలేకపొయ్యాడు..వీళ్లిద్దరి తర్వాత నందమూరి సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన మరో హీరో నారా రోహిత్..తొలి సినిమా నుండే వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సరికొత్త కథాంశాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పర్చుకున్న ఈ హీరో కి కొన్ని హిట్స్ కూడా ఉన్నాయి..అయితే గత కొంత కాలం నుండి ఈ హీరో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు..ఈయన నటించిన ఆఖరి చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’ సినిమా 2018 వ సంవత్సరం లో విడుదలైంది..అంతే ఇక ఆ తర్వాత ఈ హీరో నుండి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు..కానీ నాలుగు సినిమాల్లో నటిస్తున్నట్టు గతం లో ప్రకటనలు వచ్చాయి..వీటిల్లో కొన్ని సినిమాలు ప్రారంభం అయ్యి కొంతభాగం షూటింగ్ ని కూడా జరుపుకున్నాయి..కానీ ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలీదు కానీ ఆ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి..ప్రస్తుతం నారా లోకేష్ ఒక్క సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనలేదు..పోనీ భవిష్యత్తులో పాల్గొంటాడా అంటే ప్రస్తుతం ఆయన శరీరాకృతి చూస్తే సినిమాలు చేసే విధంగా లేదు..ఇక ఇటీవలే ఆయన పుట్టిన రోజు జరిగింది..సాదారణంగా ఏ హీరోకైనా పుట్టినరోజు నాడు తానూ చెయ్యబొయ్యే భవిష్యత్తు సినిమాల గురించి వివరాలు అందిస్తారు..కానీ నారా రోహిత్ పుట్టిన రోజు నాడు ఆయన చెయ్యబొయ్యే సినిమాలు గురించి ఎలాంటి వార్త రాలేదు..ఇవన్నీ చూస్తూ ఉంటె నారా రోహిత్ సినిమాలకు గుడ్బై చెప్పేసాడా అనే అనుమానాలు నందమూరి అభిమానుల్లో నెలకొన్నాయి..నారా రోహిత్ కంటే ఒక్క ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు..ఇప్పుడు వాళ్ళు నారా రోహిత్ ఇక సినిమాలు చెయ్యడు అనే వార్త వింటే నిరాశకి గురి అవుతారు..మరి నారా రోహిత్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఈ వార్తలపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

    Nara Rohit

    Tags