India- West Indies: టీమిండియా వెస్టిండీస్ తో రేపటి నుంచి ఐదు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఇప్పటికే వన్డే సిరీస్ నెగ్గి ఊపు మీదున్న టీమిండియా వెస్టిండీస్ ను చిత్తు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఈ మేరకు వ్యూహాలు కూడా రెడీ చేస్తోంది. ఇంగ్లండ్ తో జరిగిన టీ20, వన్డే సిరీస్ లు గెలుచుకున్న ఊపుతో వెస్టిండీస్ ను కూడా వన్డే సిరీస్ లో 3-0 తో వైట్ వాష్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 లో కూడా కరేబియన్ జట్టును కోలుకోకుండా దెబ్బతీసి చిరస్మరణీయమైన విజయాలు సాధించాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది.
వన్డే జట్టుకు శిఖర్ ధావన్ సారధ్యం వహించగా టీ20కి రోహిత్ శర్మ అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా కూడా జట్టులో చేరనున్నారు. దీంతో టీమిండియా బలం మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ ను కట్టడి చేసేందుకు కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచుల్లో వలె ఇక్కడ కూడా రోహిత్ శర్మకు జోడిగా రిషబ్ పంత్ వెళ్లనున్నాడు. వీరిద్దరు కలిసి ఓపెనర్లుగా దిగనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Vijay Devarakonda Shocking Answer: విజయ్ దేవరకొండ షాకింగ్ ఆన్సర్.. అమ్మ బాబోయ్ భరించలేం ఈ బోల్డ్ !
మరోవైపు ప్రస్తుతం జట్టు కూర్పుపై బీసీసీఐ చర్యలు తీసుకుంటోంది. సీనియర్ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంతో అతడి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా దినేష్ కార్తీక్ కు కూడా స్థానం దక్కనుందని తెలుస్తోంది. గత సిరీస్ లలో ప్రభావం చూపని దినేష్ కార్తీక్ కు ఈ సిరీస్ అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. ఇందులో రాణించకపోతే అతడిని ఎంపిక చేసేందుకు బీసీసీఐ వెనుకాడే ప్రమాదమున్నందున ఇందులో కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్స్ దీప్ సింగ్ లు తుది జట్టులో ఉన్నారు. దీంతో వెస్టిండీస్ ను కట్టడి చేసి టీ20 సిరీస్ లో కూడా తమదైన సత్తా చాటాలని టీమిండియా భావిస్తోంది. ఇందులో కూడా వైట్ వాష్ చేసి చారిత్రక విజయం నమోదు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. దీనికి గాను ఆటగాళ్లను సమాయత్తం చేస్తోంది.
Also Read: BJP Janasena: జనసేనతో పొత్తు.. ఏపీలో అధికారం కోసం బిగ్ స్టెప్ వేసిన బీజేపీ