Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ని మించిన వారు మరొకరు లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కంటెస్టెంట్స్ మరీ కఠినంగా వ్యవహరించకుండా, తన పరిధి ని దాటకుండా వ్యవహరించడం, కంటెస్టెంట్స్ చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం లో నాగార్జున ని మించిన వారు మరొకరు లేరు. అందుకే మూడవ సీజన్ నుండి 8 సీజన్ వరకు బిగ్ బాస్ టీం కి ఎన్నో ఛాయిస్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నాగార్జున ని వదలడం లేదు. ఇక ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ చాలా సున్నితంగా రఫ్ఫాడించేసాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ సీజన్ లో కంటెస్టెంట్స్ కి సంబంధించిన రివ్యూస్ ని నాగార్జున ఒక్కడే చెప్పేవాడు. కానీ ఈ సీజన్ లో కాస్త కొత్తగా ఉండేందుకు కోసం కంటెస్టెంట్స్ తోనే రివ్యూస్ చెప్పించే ప్రయత్నం చేసాడు.
అలా సాగిన ఈ చర్చలు హీట్ వాతావరణంలోకి వెళ్ళింది. ఆ తర్వాత నాగార్జున చివర్లో కొంతమంది ఫ్లాప్ కంటెస్టెంట్స్ పేర్లను చెప్పి, వాళ్ళ పేర్లతో ఉన్న మసుకులను సుత్తి తీసుకొని పగలగొట్టాడు. ముందుగా ప్రేరణ మాస్కు పెట్టి, ఆ మాస్కుని సుత్తితో పగలగొడుతాడు నాగార్జున. ఆ తర్వాత ప్రేరణతో మాట్లాడుతూ హౌస్ లోకి అడుగుపెట్టే ముందే ఎంత హుషారుగా ఉన్నావు, ఎంత బాగా మాట్లాడావు, టాస్కులు కూడా ఇరగదీస్తావు అనుకున్నాను, కానీ మా అంచనాలను ఏమాత్రం అందుకోలేదు ప్రేరణ, ఈ వారం నువ్వు టోటల్ గా ఫ్లాప్ అయ్యావు, వచ్చే వారంలో మా అంచనాలకు రీచ్ అవ్వాలి అని అంటాడు. అప్పుడు ప్రేరణ మీ అంచనాలకు మించే నా పెర్ఫార్మన్స్ ని మెరుగుపర్చుకుంటాను సార్ అని అంటుంది. ప్రేరణ తర్వాత నాగార్జున సీత కి సంబంధించిన మాస్కుని తగిలించి పగలగొడుతాడు. ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతూ సీత నువ్వు చాలా కేరింగ్ ఉన్న అమ్మాయివి, అదే సమయంలో బాధ్యతతో వ్యవహరించే అమ్మాయివి కూడా, నేను నిన్ను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నాను కానీ నీలో ఉన్న లక్షణాలు మొత్తం ఏమి అయ్యాయి?, నీ పేరు నుండి కేవలం సీత మాత్రమే నాకు కనిపిస్తుంది, కిరాక్ పోయింది, నాకు వచ్చే వారం ఆ కిరాక్ సీత తిరిగి రావాలి అని అంటాడు నాగార్జున. వీళ్లిద్దరి తర్వాత నాగార్జున బేబక్క కి సంబంధించిన మాస్కుని తగిలించి పగలగొడుతాడు. ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతూ వేరే లీడర్ క్లాన్ లోకి నువ్వు వెళ్లడం కాదు, నీకు నువ్వే లీడర్ అవ్వాలి అని అంటాడు నాగార్జున, దానికి బేబక్క సమాధానం చెప్తూ ‘అవును సార్..అందుకే ఈరోజు ఓపెన్ అయిపోయాను’ అని చెప్పుకొచ్చింది.
ఇక ఆ తర్వాత ఆదిత్య ని ఫ్లాప్ కంటెస్టెంట్స్ లిస్ట్ లోకి చేర్చి అతని మాస్కుని కూడా పగలగొడుతాడు నాగార్జున, ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఆటలోకి ముందుకు రా, కంటెస్టెంట్స్ అడ్రెసులు కనుక్కోవడం కాదు, కంటెస్టెంట్స్ తో బాగా కలవు అంటూ ఆదిత్య కి క్లాస్ పీకాడు. ఇక చివర్లో విష్ణు ప్రియా గురించి మాట్లాడుతూ నీకు నువ్వు చాలా స్ట్రాంగ్ మ్యాచో అని అనుకుంటున్నావు కదా , అది కరెక్ట్ కాదు అమ్మా, నువ్వు ప్రవర్తించే తీరుని బట్టి కూడా ఆడియన్స్ నిన్ను జడ్జ్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఇలా ఈ 5 మందిని ఫ్లాప్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో చేర్చిన నాగార్జున, వచ్చే వారంలో వీరిలో ఎంతమందిని బయటకి తీస్తాడో చూడాలి.