Akkineni Nagarjuna : నాగార్జున అన్నయ్య అని పిలిచే ఒకే ఒక్క హీరో, ఆయనంటే ఎందుకంత ఇష్టం… చిరంజీవి కాదు!

పరిశ్రమలో నాగార్జున ఒకే ఒక హీరోని అన్నయ్య అని పిలిచేవారట. ఆ హీరో చిరంజీవి అనుకుంటే పొరపాటే. నాగార్జున ఓ సందర్భంలో తనకు ఇష్టమైన నటుడు పేరు వెల్లడించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Written By: S Reddy, Updated On : October 8, 2024 10:39 am

Akkineni Nagarjuna

Follow us on

Akkineni Nagarjuna :  అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టాడు నాగార్జున. కెరీర్ బిగినింగ్ లో నాగార్జున స్ట్రగుల్ అయ్యారు. మాస్ హీరోగా ప్రయత్నం చేసి విఫలం చెందారు. మజ్ను, జానకి రాముడు, గీతాంజలి వంటి క్లాస్ సబ్జక్ట్స్ ఆయనకు సెట్ అయ్యాయి. ఆ చిత్రాలు బాగా ఆడాయి. అనంతరం మాస్ కమర్షియల్ సబ్జక్ట్స్ చేసి సక్సెస్ అయ్యారు. నాగార్జున నటించిన శివ, కిల్లర్, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, హలో బ్రదర్ ఆయనకు మాస్ హీరో ఇమేజ్ తెచ్చాయి.

నాగార్జున ప్రయోగాలకు పెట్టింది పేరు. అన్నిరకాల జోనర్స్ ఆయన ట్రై చేశారు. రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న నాగార్జున అన్నమయ్య వంటి భక్తిరస చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం గొప్ప విషయం. అన్నమయ్య నాగార్జున కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది. శ్రీరామదాసు చిత్రంలో కంచర్ల గోపన్నగా నటించి మరో హిట్ కొట్టాడు. నాగార్జున సాయిబాబాగా కూడా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

సుదీర్ఘ కెరీర్లో నాగార్జున కొన్ని మల్టీస్టారర్స్ కూడా చేశారు. వాటిలో సీతారామరాజు ఒకటి. నందమూరి హరికృష్ణ మరొక హీరోగా నటించారు. నాగార్జున-హరికృష్ణ అన్నదమ్ముల పాత్రలు చేశారు. సీతారామరాజు చిత్రానికి వైవిఎస్ చౌదరి దర్శకుడు. మంచి విజయం కూడా అందుకుంది. కాగా హరికృష్ణ అంటే నాగార్జున చాలా ఇష్టం అట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.

గతంలో స్టార్ మా లో ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు? షోకి నాగార్జున హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఒక ఎపిసోడ్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చాడు. మాటల్లో మాటగా నందమూరి కుటుంబంలో నాకు ఎవరంటే ఇష్టమో తెలుసా… మీ నాన్న హరికృష్ణ. నేను పరిశ్రమలో ఎవరినీ అన్నయ్య అని పిలవను. మీ నాన్నను మాత్రమే పిలిచేవాడిని. సీతారామరాజు మూవీ సమయంలో ఇంకా అభిమానం పెరిగింది… అని నాగార్జున అన్నారు.

నాగార్జున మాటలను కొనసాగిస్తూ… ఎన్టీఆర్, అవును నేను సీతారామరాజు సెట్స్ కి వచ్చినప్పుడు మిమ్మల్ని తమ్ముడు తమ్ముడు అంటూ నాన్న ఆప్యాయంగా పిలవడం చూశాను, అన్నాడు. ఎన్టీఆర్-నాగార్జున కూడా చాలా క్లోజ్. నాగార్జునను ఎన్టీఆర్ బాబాయ్ అని పిలుస్తాడు. అదే సమయంలో బాలకృష్ణతో నాగార్జున పడదు అనే టాక్ ఉంది. వీరిద్దరూ సన్నిహితంగా కనిపించిన సందర్భం లేదు.

బాలయ్య ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు నాగార్జున వెళ్ళలేదు. నాగ చైతన్య, అఖిల్ మాత్రం హాజరయ్యారు. అలాగే ఇటీవల బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగార్జున వెళ్ళలేదు. ఆహ్వానం అందినప్పటికీ ఆయన రాలేనని చెప్పారని టాక్.