https://oktelugu.com/

Vijay Deverakonda Movie : విజయ్ దేవరకొండ సినిమాలో బాలకృష్ణ..నందమూరి ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్ ఇవ్వనున్న ‘దేవర’ నిర్మాత!

వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి వంద కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారట. స్టోరీ స్పాన్ కూడా పెద్దది కావడంతో రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారట.

Written By:
  • Vicky
  • , Updated On : November 13, 2024 / 05:53 PM IST

    Vijay Deverakonda Movie

    Follow us on

    Vijay Deverakonda Movie : ఇండస్ట్రీ లోకి వచ్చిన 5 ఏళ్లలోపే స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ని సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న ఆయన ‘గీత గోవిందం’ చిత్రంతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన నుండి విడుదలైన సినిమాలన్నీ అనుకున్న స్థాయి లో విజయం సాధించలేకపోయాయి. ముఖ్యంగా ఇటీవల కాలం లో ఈయన నుండి వచ్చిన ‘లైగర్’, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. మధ్యలో సమంత తో కలిసి చేసిన ‘ఖుషి’ చిత్రం మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యింది కానీ, కమర్షియల్ గా మాత్రం యావరేజ్ అనిపించుకుంది. ప్రస్తుతం ఆయన ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక సినిమా చేస్తున్నాడు.

    వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి వంద కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారట. స్టోరీ స్పాన్ కూడా పెద్దది కావడంతో రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారట. ఈ టీజర్ కి నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని భావించి నిర్మాత వంశీ ఆయన్ని సంప్రదించగా, బాలయ్య వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. వచ్చే నెలలో టీజర్ ని విడుదల చేసే అవకాశం ఉందట. ఈ సినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ భోర్సే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

    అయితే ఈ సినిమా టీజర్ కి మాత్రమే కాదు, సినిమాకి కూడా బాలయ్య బాబు వాయిస్ ఓవర్ అందించబోతున్నాడట. ఇప్పటి వరకు బాలయ్య ఒక్క సినిమాకి కూడా వాయిస్ ఓవర్ ని అందించలేదు. విజయ్ దేవరకొండ కోసం మొట్టమొదటిసారి ఆయన ఆ పని చేయబోతున్నాడు. బాలయ్య ఫ్యాక్టర్ ఈ సినిమాకి ఎంత వరకు సహాయపడుతుందో చూడాలి. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, బాలయ్య తో కూడా ఒక సినిమాని సమాంతరంగా నిర్మిస్తుంది. ఈ చిత్రానికి ‘దాకు మహారాజ్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుస సూపర్ హిట్స్ లో ఉన్న బాలయ్య నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కి క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం. చూడాలి మరి ఈ సినిమా బాలయ్య బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్రని ఇంకెంత దూరం తీసుకెళ్తుందో అనేది.