Homeఎంటర్టైన్మెంట్Balakrishna Hemamalini Viral Video: స్టార్ హీరోయిన్ కాళ్ళు మొక్కిన నందమూరి బాలకృష్ణ.. సంచలనం రేపుతున్న...

Balakrishna Hemamalini Viral Video: స్టార్ హీరోయిన్ కాళ్ళు మొక్కిన నందమూరి బాలకృష్ణ.. సంచలనం రేపుతున్న వీడియో..

Balakrishna Hemamalini Viral Video: తన కన్న తల్లిదండ్రులకు తప్ప , నందమూరి బాలకృష్ణ ఒకరి కాళ్ళని మొక్కడం ఎప్పుడైనా చూశారా ?, తన కాళ్లకు మొక్కడానికి వచ్చిన వాళ్ళని కూడా ఆయన మందలించేవాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తప్ప, ఎవరు కాళ్లకు మొక్కకు అని. అలాంటి నందమూరి బాలకృష్ణ, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమ మాలిని కాళ్ళకు దండం పెడుతూ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అనంతరం ఆమె ఆప్యాయతతో బాలయ్య ని పలకరించడం , బాలయ్య వినయంగా నిలబడి మాట్లాడడం వంటి విజువల్స్ ఇప్పుడు అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మనం మన కళ్ళతో చూస్తున్నది బాలయ్యనేనా ?, ఆయన ఒకరి కాళ్ళు పట్టుకోవడం ఏంటి అంటూ సోషల్ మీడియా లో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ని మీరు క్రింద చూడొచ్చు.

Also Read: పవన్ కళ్యాణ్ తో ‘ధురంధర్ 2’ డైరెక్టర్ ఆదిత్య డర్ భేటీ.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ లోడింగ్..

ఇక హేమ మాలిని విషయానికి వస్తే, ఈమె బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ లేడీ సూపర్ స్టార్. ఆరోజుల్లో ఈమె ఉందంటే చాలు , సినిమా థియేటర్స్ కి క్యూలు కాటేవారు. అప్పట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర తో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన హేమ మాలిని, చివరికి అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరికి సన్నీ డియోల్, బాబీ డియోల్, ఇషా డియోల్ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. సన్నీ డియోల్ తన తల్లిదండ్రులు లాగానే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఇప్పటికీ కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ తన సత్తా చాటుతూ నేటి తరం ఆడియన్స్ ని కూడా అలరిస్తున్నాడు. ఇక బాబీ డియోల్ విషయానికి వస్తే ఈయన కూడా హీరో గా సక్సెస్ అయ్యాడు కానీ, పెద్ద సూపర్ స్టార్ రేంజ్ కి మాత్రం వెళ్లలేకపోయాడు.

కానీ ఇప్పుడు మాత్రం ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఒకడు. ఈయన నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం లో విలన్ గా కూడా నటించాడు. ఇక ఇషా డియోల్ విషయానికి వస్తే, ఈమె కూడా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇలా ఫ్యామిలీ మొత్తం సినీ ఇండస్ట్రీ లోనే ఉన్నారు. ధర్మేంద్ర కూడా చివరి శ్వాస వరకు సినిమాలు చేస్తూనే ఉండేవాడు. ఇక ఆయన సతీమణి హేమ మాలిని కూడా ఇప్పటికీ నటిస్తూనే ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Christopher Nolan

Christopher Nolan: ది గ్రేట్ క్రిస్టోఫర్ నోలన్ కు నచ్చిన భారతీయ దర్శకుడు ఎవరో తెలుసా…

Christopher Nolan: క్రిస్టోఫర్ నోలన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రముఖ దర్శకుడిగా తనదైన శైలిలో చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన 'ది ఒడిస్సీ'...
Dhanush

Dhanush: విజయ్ సీఎం అయ్యాడని.. అందరూ అయిపోతారా..వీడియో వైరల్

Dhanush: తమిళనాడులో మరో సినిమా నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అనే చర్చ హాట్ టాపిక్ అయింది. ఇటీవల ప్రముఖ నటుడు ధనుష్ చేసే కొన్ని కార్యక్రమాలను భట్టి చూస్తే ఆయన కూడా త్వరలో...
Nagendra Sai

Nagendra Sai: ఏడాదిలో 13 కొలువులు.. ఈ కడప యువకుడికి ఎలా సాధ్యమైంది.. చేసిన కృషి ఏంటి

Nagendra Sai: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రావడమే కష్టంగా ఉంది.. నోటిఫికేషన్లు వచ్చిన కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఈ పరిస్థితులు పోటీపడి కొలువు పుట్టడం అంత సులభం కాదు. లక్షల...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: తెలుగు గడ్డకు.. సూర్య వంశీకి ఏంటి సంబంధం.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన నిజం..

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద...
Hydra Ranganath

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కూడా మనిషే.. అతడికీ కోపం ఉంటుంది..

Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర...
Oktelugu Epaper