Jetty: సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో మాన్యం కృష్ణ హీరోగా వస్తున్న సినిమా జెట్టి. నందిత శ్వేతా హీరోయిన్. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఈ క్రమంలోనే ట్రైలర్ చాలా బాగుందని.. చిత్రబృందానికి ఆల్‌దిబెస్ట్ చెప్పారు. మత్స్యకార జీవనం, వారి స్థితిగతులు భావోద్వేగాలకు అనుగునంగా ఈ కథను తెరకెక్కించారు. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత వేణు మాధవ్ మాట్లాడుతూ.. ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని “జెట్టి” సినిమాను నిర్మించినట్లు తెలిపారు. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద కనిపించని జీవితాలను సుబ్రమణ్యం చక్కగా చూపించారని పేర్కొన్నారు. త్వరలోనే థియేటర్లలో “జెట్టి” సినిమాను మీ ముందుకు తీసుకొస్తామని అన్నారు. నా ఆశ కంటే మా నాన్న ఆశయం గొప్పది అనే కధానాయిక చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. జెట్టి కోసం రెండు వర్గాల మధ్య సాగే సన్నివేశాలతో దర్శకుడు కధను ఆసక్తికరంగా మలిచారు. కార్తిక్ కొండకండ్ల మ్యూజిక్ అందించారు.
మరోవైపు అఖండ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు బాలయ్య.. దీంతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వేదికగా అన్‌స్టాపబుల్ అనే ఓ టాక్‌షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. బాలయ్య హోస్ట్ అనగానే అటు సినీ ప్రియులతో పాటు, చిత్రసీమలోనూ ఆసక్తి నెలకొంది. తన కెరీర్లో తొలిసారి హోస్ట్‌గా బాలయ్య కనిపించడం విశేషం.