https://oktelugu.com/

Krishnam Raju: ఇంట్లో పనిమనిషికి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన … కృష్ణం రాజు ఫ్యామిలి

Krishnam Raju: రెబల్‌ స్టార్‌  కృష్ణం రాజు ఇంట్లో పనిచేసే ఆవిడకు … ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి ఊహించని షాక్ ఇచ్చారు.  వారి ఇంట్లో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను ఆయన ఫ్యామిలి అంతా కలిసి ఘనంగా సన్మానించారు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమెతో కేక్‌ కట్‌ చేయించి… సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలును కృష్ణంరాజు కూతురు ప్రసీద సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 25 […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 22, 2021 / 05:19 PM IST
    Follow us on

    Krishnam Raju: రెబల్‌ స్టార్‌  కృష్ణం రాజు ఇంట్లో పనిచేసే ఆవిడకు … ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి ఊహించని షాక్ ఇచ్చారు.  వారి ఇంట్లో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను ఆయన ఫ్యామిలి అంతా కలిసి ఘనంగా సన్మానించారు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమెతో కేక్‌ కట్‌ చేయించి… సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలును కృష్ణంరాజు కూతురు ప్రసీద సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

    25 ఏళ్లుగా మాకోసం చాలా చేశారు. థ్యాంక్యూ పద్మ ఆంటీ అంటూ కృతఙ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా ఈ సందర్భంగా కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి… ఆమెకు ఓ బంగారు గొలుసును కానుకగా ఇచ్చినట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంట్లో పనిచేసే మహిళను కూడా ఇంట్లో మనిషిగా  భావించి ఇలా కార్యక్రమం చేయడం గ్రేట్‌ అంటూ కృష్ణంరాజు దంప‌తుల‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

    https://twitter.com/PraseedhaU/status/1451105102694019072?s=20

    కాగా ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్‌ సినిమాను వంశీ, ప్రమోద్‌ లతో కలిసి ప్రసీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం​ వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా  విడుదల కానుంది. రేపు ( అక్టోబర్ 23 ) ప్రభాస్ పుట్టిన రోజు నేపధ్యం లో  “రాధే శ్యామ్” టీమ్ రేపు టీజర్ రిలీజ్‌తో ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. “రాధే శ్యామ్” టీజర్ రేపు ఉదయం 11:16 గంటలకు విడుదల కానుంది.

    గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ “రాధే శ్యామ్” ఓవర్సీస్ రైట్స్ ను భారీ మొత్తానికి దక్కించుకున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ తో పాటు… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్‌ ” లో కూడా నటిస్తున్నాడు. అలానే ఓం రావత్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. దీని తర్వాత నాగ్‌ అశ్విన్‌ ” ప్రాజెక్టు కె “, సందీప్ రెడ్డి వంగా ” స్పిరిట్ ” చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నాడు.