Mohan Babu: ‘అల్లు అరవింద్’ మహా మేధావి. రూపాయి ఖర్చు పెట్టి పది రూపాయిలు ఎలా సంపాదించాలో అరవింద్ కి తెలిసినంత బాగా సినిమా ఇండస్ట్రీలో మరొకరికి తెలియదు. ఏ నిర్మాత ఊహించకముందే తెలుగు ఓటీటీ ఆహాను తీసుకొచ్చాడు. పోటీగా మరొకటి రావడానికి, వచ్చి నిలబడటానికి చాలా సమయం పడుతుంది, ఈ లోపు ఆహా ఓటీటీ సంస్థను జనంలోకి తీసుకువెళ్లడానికి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు పోతున్నాడు అరవింద్.

నిజానికి కంటెంట్ విషయంలో ఆహా మొదటి నుంచి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎప్పటికపుడు భారీతనంతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటూనే ఉంది. ఇప్పటికే పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలు అని తేడా లేకుండా ఏది బాగుంటే దాన్ని కొనేసి అప్ లోడ్ చేస్తున్నారు.
దీనికితోడు స్పెషల్ ప్రోగ్రామ్ లను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆహా’ వారు బాలకృష్ణతో భారీ ఓటీటీ టాక్ షో ను చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ అనే టైటిల్ తో ఆహా లో రాబోతున్న ఈ టాక్ షో పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య అభిమానులు మందు నుంచి ఆహాకు దూరంగా ఉన్నారు.
కానీ ఇప్పుడు బాలయ్య షో తో వారంతా ఆహాను ఓన్ చేసుకుంటారు. పైగా ఈ షోకి అద్బుతమైన రేటింగ్ వస్తోందని ఆహా వారు నమ్మకంగా ఉన్నారు. అందుకే తాజాగా మరో టాక్ షోను ప్లాన్ చేస్తున్నారు. ఆ షోలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అలాగే మోహన్ బాబుతో ఒక భారీ వెబ్ సిరీస్ ను కూడా ఆహా వారు ప్లాన్ చేస్తున్నారట.
మరి ఈ వెబ్ సిరీస్ తో పాటు ఆ టాక్ షో ఎలా ఉంటుందో చూడాలి. మరి బాలయ్య తరహాలోనే మోహన్ బాబు కూడా ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఈ మధ్య మా ఎన్నికల నేపథ్యంలో మోహన్ బాబు కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.