https://oktelugu.com/

Akhanda Movie: బాలయ్య “అఖండ” సినిమా ఒటీటీ రిలీజ్ ఎప్పుడంటే…

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో మూడో చిత్రంగా విడుదలైన అఖండ.. అఖండమైన విజయాన్ని అందుకొని.. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక రికార్డులను వాసులు చేస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్.. తమన్ మాస్ మ్యూజిక్ అఖండను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్​కి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూనకాలు తెప్పిస్తోంది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా భారీ రికార్డులతో దూసుకెళ్లిపోతోంది. ఓవర్సీస్​లోనూ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 8, 2021 / 08:26 PM IST
    Follow us on

    Akhanda Movie: నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో మూడో చిత్రంగా విడుదలైన అఖండ.. అఖండమైన విజయాన్ని అందుకొని.. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక రికార్డులను వాసులు చేస్తోంది. బాలయ్య మాస్ యాక్షన్.. తమన్ మాస్ మ్యూజిక్ అఖండను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్​కి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూనకాలు తెప్పిస్తోంది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా భారీ రికార్డులతో దూసుకెళ్లిపోతోంది. ఓవర్సీస్​లోనూ అఖండ జోరు మాములుగా లేదు. థియేటర్లో మాస్ జాతర చూపిస్తున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టనుందంట.

    ఇక దీంతో బాలయ్య అభిమానులు ఒకింత ఆందోళనకు గురవుతున్న ఇంకొంచెం హ్యాప్పి గానే ఉన్నారు. ధియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ వైపు పరుగులు పెడుతుంది. ఈ తరుణంలో ఓటిటీ లో అప్పుడే విడుదల చేయడం ఏంటని పలువురు విమర్శలు చేస్తున్నారు. కాగా కొత్త సంవంత్సరం కానుకగా అఖండ ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నదట. అఖండ డిజిటల్ హక్కులను ‘మా’ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ మొత్తాన్ని ముట్టజెప్పి కొనుగోలు చేసిన ఈ చిత్రాన్ని జనవరి 2022 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించనున్నారట.. థియేటర్లో పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఓటీటీలో ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా చేయగా… శ్రీకాంత్ విలనిజం తో మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు.