https://oktelugu.com/

Pushpa Movie: “పుష్ప” నుంచి ‘ఊ అంటావా… ఊహు అంటావా’ అంటూ వచ్చేస్తున్న సమంత…

Pushpa Movie: గత ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాతో కొద్ది రోజుల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఐకాన్ స్టార్. ఈ ఏడాది కూడా సాలిడ్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు బన్నీ. ఈ సినిమాను రెండు భాగాలు తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ మూవీలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 8, 2021 / 08:11 PM IST
    Follow us on

    Pushpa Movie: గత ఏడాది ఆరంభంలో ‘అల వైకుంఠపురములో’తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాతో కొద్ది రోజుల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఐకాన్ స్టార్. ఈ ఏడాది కూడా సాలిడ్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు బన్నీ. ఈ సినిమాను రెండు భాగాలు తెర‌కెక్కిస్తున్నారు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… రష్మికా మందన్నా కథానాయిక గా చేస్తుంది. ఈ మూవీలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. అలానే కన్నడ హీరో ధనుంజయ, సునీల్, అనసూయ, అజయ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

    కాగా ఈ సినిమాలో సమంత ఒక ఐటమ్ సాంగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ లో ఈ పాట చిత్రీకరణను మూవీ ఊ ఐ‌టి పూర్తి చేశారు. ఈ మేరకు సాంగ్ రిలీజ్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 10 న రిలీజ్ చేస్టున్నట్లు మేకర్స్ తెలిపారు. “మాస్ పార్టీకి సిద్ధం కండి .. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్” అంటూ సామ్ న్యూ పోస్టర్ తో అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో సామ్ బ్లూ కలర్ తళుక్కు టాప్ లో సెక్సీ లుక్ తో అదరగొట్టేసింది.. ప్రొఫెషనల్ ఐటెం భామలా కనిపించడంతో అమ్మడి ఎక్స్ ప్రెషన్స్, బన్నీ ఊర మాస్ స్టెప్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంటాయని తెలుస్తోంది. కాగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. మొదటి భాగం పుష్ప – ది రైజ్ ని డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది.

    https://twitter.com/MythriOfficial/status/1468575135258972165?s=20