https://oktelugu.com/

Bala Krishna: అలాంటి వాళ్ళని వదిలేదు లేదు అంటున్న బాలయ్య… ఎదురుపడితే దబిడిడిబిడే అంటూ వార్నింగ్ ?

Bala Krishna: మారుతున్న కాలానుగుణంగా సోషల్ మీడియా ప్రభావం ప్రజల మీద గట్టిగానే ఉంది. సెలబ్రిటీలు ఏ చిన్న పొరపాటు చేసినా… సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. దాదాపు అందరు హీరోలు, హీరోయిన్లు ట్రోలింగ్ బారిన పడ్డారు. నందమూరి బాలకృష్ణను కూడా బాగా ట్రోల్ చేస్తుంటారు. బాలయ్య ఏం చేసినా, ఏం మాట్లాడినా ట్రోల్స్ రావడం చూస్తూనే ఉంటాం. అయితే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 3, 2022 / 04:54 PM IST
    Follow us on

    Bala Krishna: మారుతున్న కాలానుగుణంగా సోషల్ మీడియా ప్రభావం ప్రజల మీద గట్టిగానే ఉంది. సెలబ్రిటీలు ఏ చిన్న పొరపాటు చేసినా… సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. దాదాపు అందరు హీరోలు, హీరోయిన్లు ట్రోలింగ్ బారిన పడ్డారు. నందమూరి బాలకృష్ణను కూడా బాగా ట్రోల్ చేస్తుంటారు. బాలయ్య ఏం చేసినా, ఏం మాట్లాడినా ట్రోల్స్ రావడం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా ఈ విషయం పై బాలయ్య ఘాటుగా స్పందించారు.

    nandamuri bala krishna sensational comments about trollers

    బాలయ్య హోస్ట్ గా ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ అనే షో టెలికాస్ట్ అవుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ షోకి రవితేజ వచ్చారు. ఈ సందర్భంగా రవితేజ-బాలకృష్ణల మధ్య గొడవలు ఉన్నాయంటూ చాలా రోజులుగా వార్తలు వస్తోన్న విషయాన్ని ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇక షో చివర్లో ట్రోలర్స్ కి క్లాస్ పీకారు బాలయ్య. ‘ఏదేదో చెబుతూ… ఊరూ, పేరూ లేకుండా ఎక్కడో ఉంటూ సోషల్ మీడియాలో ఫేక్ విషయాలను వ్యాప్తి చేసే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య.

    ఇటీవల సర్జరీ జరిగిన లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందని… ట్రోలర్స్ ఎదురుపడితే దబిడిదిబిడే అంటూ గట్టిగా చెప్పారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ నెలాఖరు నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇందులో బాలయ్యకి ధీటుగా కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.