https://oktelugu.com/

Sir Movie: క్లాస్ కి రెడీ అయిన ధనుష్ ” సార్ “… క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించిన డైరెక్టర్ త్రివిక్రమ్

Sir Movie: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన నటించిన అసురన్ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అలానే ఇప్పటి వరకు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ హీరో… ఇప్పుడు నేరుగా తెలుగులో అలరించేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘సార్‌’ అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడు ధనుష్. వెంకీ అట్లూరి ఈ సినిమాకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 3, 2022 / 05:04 PM IST
    Follow us on

    Sir Movie: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన నటించిన అసురన్ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అలానే ఇప్పటి వరకు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ హీరో… ఇప్పుడు నేరుగా తెలుగులో అలరించేందుకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘సార్‌’ అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నాడు ధనుష్. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… కేరళ బ్యూటీ సంయుక్తా మీనన్‌ హీరోయిన్ గా చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తమిళ వెర్షన్ కి ‘వాత్తి’ అనే టైటిల్ ఖాయం చేశారు.

    కాగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది మూవీ యూనిట్. ఈ కార్యక్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ క్లాప్‌ కొట్టగా, నిర్మాత చినబాబు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాలో ధనుష్‌ జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 5 నుంచి ప్రారంభం కాబోతోంది. కాగా ఈ సినిమాకు ముందే శేఖర్‌ కమ్ములతో ఓ సినిమాకు ఓకే చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ కూడా పట్టాలెక్కనుందని సమాచారం. ఇటీవల సార్ మూవీ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో భారీ బ్లాక్‌బోర్డ్‌తో పాటు తరగతిలో విద్యార్థులు దానివైపు చూస్తున్నట్టు, అలాగే ధనుష్ పాఠాలు చెబుతున్నట్టు చూపించారు.