Nana Patekar: సినిమాలలో హీరోలుగా ఉన్నవారు.. రియల్ లైఫ్ లో హీరోలు కాలేదు. కొంతమంది మాత్రమే తమకు ఎంతో ఇచ్చిన సమాజానికి కొంత ఇచ్చి.. తన పేరును సార్ధకం చేసుకుంటున్నారు.. అయినప్పటికీ వారి సమాజానికి చేస్తున్నది చాలా తక్కువే. వారికి సమాజం ఇస్తున్నది చాలా ఎక్కువే. ఇదే విషయాన్ని వారి ముందు ప్రస్తావిస్తే ఒప్పుకోరు. పైగా సమాజానికి తాము ఎంతో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. వాస్తవానికి సామాజిక బాధ్యత అనేది సినీనటులకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వారికి ఈ సమాజం చాలా ఇచ్చింది.. ఇస్తోంది కూడా. ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్నప్పుడు.. దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలు కచ్చితంగా ముందుకు రావాలి. ఎందుకంటే వారి సినిమాలు విడుదలవుతున్నప్పుడు ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. సినిమా నటులు స్టూడియోలు నిర్మిస్తుంటే రాయితీలు ఇస్తున్నాయి. అటువంటి వ్యక్తులు దేశం కోసం ఎంతో కొంత చేయాలి. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు తమవంతుగా తోడ్పాటు అందించాలి. బాధ్యతాయుతమైన పౌరులుగా వారు వెలుగొందాలి. అయితే ఈ విషయంలో కొంతమంది నటులు మాత్రం గొప్ప పాత్ర పోషిస్తున్నారు. గొప్పగా వెలుగొందుతున్నారు. అలాంటివారిలో బాలీవుడ్ నటుడు నానాపటేకర్ ఒకరు.
Also Read: సాగరనగరం పై నిఘా.. పోలీసుల జల్లెడ!
దేశం కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టాడు..
1999లో శత్రు దేశంతో భారత్ పోరాడాల్సి వచ్చింది. కార్గిల్ యుద్ధం పేరుతో జరిగిన ఆ రణంలో భారత్ శత్రుదేశాన్ని తుద ముట్టించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. నాడు ఆ రణంలో భరతజాతి మొత్తం దేశం కోసం కదిలింది. సరిహద్దుల్లో సైన్యం చేస్తున్న యుద్ధానికి సంఘీభావం పలికింది. వయసుతో తారతమ్యం లేకుండా జాతి యావత్తు సైన్యానికి అండగా నిలిచింది . ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కూడా ఉన్నారు. ఆయన దేశం కోసం యుద్ధంలో పాల్గొన్నారు. ఏకంగా రక్షణ శాఖ మంత్రి నుంచి అనుమతి తీసుకున్నారు. గతంలో ఆయనకు సాయుధ బలగాలలో పనిచేసిన అనుభవం ఉంది. అందువల్లే ఆయనకు పనిచేయడానికి సైన్యం అంగీకారం తెలిపింది. దేశం కోసం ప్రాణాలనే పణంగా పెట్టాడు నానా పటేకర్. ఇదే విషయాన్ని నానా పటేకర్ ఎప్పుడూ బయటికి చెప్పుకోలేదు. బయట చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ దేశంతో జరుగుతున్న అనధికారిక యుద్ధం నేపథ్యంలో నానా పటేల్ చేసిన సేవలను జాతీయ మీడియా ప్రముఖంగా ప్రసారం చేస్తోంది. ఇటువంటి నటుడికి సెల్యూట్ అంటూ ప్రణామాలు చేస్తోంది.”సినిమా హీరోలందరూ డెమి గాడ్స్ కావచ్చు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి హీరోలు కూడా దేశం కోసం పాటుపడుతుంటారు. అలాంటివారిని ఈ దేశం కచ్చితంగా గౌరవించాలని.. కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవసరమైతే ఈయన చేసిన త్యాగాన్ని భావితరాలు గుర్తుంచుకునేలా చేయాలని”జాతీయ మీడియా తన కథనాలలో పేర్కొంటున్నది.