Operation Sindoor : ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాక్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితిలో నెలకొన్నాయి. ఈ కారణంగా దేశంలో కొన్ని పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ నిర్వహణ ఆగిపోయింది. సరిహద్దుల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాజస్థాన్ ప్రాంతంలోని దుకాణాలను మూసి వేయించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని ఫేక్ న్యూస్ లు కూడా ప్రచారం అవుతున్నాయి. భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో ఏటీఎంలో పనిచేయడం లేదని.. బ్యాంకులు మూతపడుతున్నాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. అవేంటంటే?
Also Read : భారత సైన్యం దాడి.. పాక్ డ్రోన్ లాంచ్‌ప్యాడ్ ధ్వంసం
ఆపరేషన్ సింధూర నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థపై కేంద్ర ఆర్థిక వ్యవస్థ ప్రత్యేక సూచనలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. బ్యాంకుల్లో సరైన నిల్వలను ఉంచుకోవాలని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. వినియోగదారులతోపాటు వ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా నగదును అందించాలని.. అలాగే ఏటీఎంల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. యుద్ధం పేరిట కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు వినియోగదారులకు ఇబ్బందులు కలగజేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని.. అయితే ఇలాంటి సమయంలోనే ప్రజలకు అవసరమైన నగదును అందించి వారికి ఆటంకాలు లేకుండా చూడాలని అన్నారు.
ఇక బ్యాంకు లావాదేవీలపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కొందరు నగదు విత్ డ్రా పై పరిమితులు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారని.. ఇందులో ఏమాత్రం నిజం లేదని అన్నారు. ప్రజలకు కావాల్సిన నగదును తీసుకునే స్వేచ్ఛ ఉందని.. అయితే నిబంధన ప్రకారం విత్ డ్రా చేసుకోవాలని తెలిపారు. అంతేగాని ఇప్పటివరకు విత్ డ్రా రాలేదా డిపాజిట్ పై ఎలాంటి నిబంధనలు విధించలేదని పేర్కొన్నారు. అందువల్ల ఈ విషయంలో ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. మరోవైపు బ్యాంకు లోను విత్ డ్రా పై పరిమితి లేనందున వినియోగదారులకు కావలసిన నగదును అందించాలని సూచించారు. అంతేకాకుండా బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో సరైన నగదు నిలువలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆకస్మిక పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు ముందస్తుగా వస్తువులు లేదా ఆర్థిక కార్యకలాపాలకు నగదును అందించాలని చెప్పారు. మనీ ట్రాన్సాక్షన్లో కీలక భాగమైన యూపీఐ సర్వీసులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.
Also Read : భారత్ దెబ్బ అదుర్స్.. పాకిస్థాన్‌లోని మూడు వైమానిక స్థావరాపై దాడులు
దేశ సరిహద్దుల్లో పనిచేసే బ్యాంకు ఉద్యోగులు వారితో పాటు తమ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నారు. ఈ విషయంలో భద్రత ఏజెన్సీ లతో సమన్వయం పాటించి సరైన రక్షణ పొందాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఏర్పడితే లేదా ఇలాంటి విపత్కర పరిస్తితులు ఎదుర్కొన్న వెంటనే భద్రత సిబ్బందికి సమాచారం అందించాలని.. ఈ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు అధికారులకు సూచించారు. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఐ అలర్టు ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్న బ్యాంకు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.