mahesh babu namrata shirodkar
Mahesh Babu: నమ్రత శిరోద్కర్ లేటెస్ట్ డెసిషన్ తో మహేష్ బాబు కంగు తిన్నాడనే టాక్ వినిపిస్తుంది. రేణు దేశాయ్ బాటలో నమ్రత నడుస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఆ కథ ఏమిటో చూద్దాం.. నమ్రత శిరోద్కర్ బాలీవుడ్ మోడల్ అండ్ హీరోయిన్. హిందీలో అనేక చిత్రాల్లో నటించారు. తెలుగులో అంజి, వంశీ చిత్రాల్లో నమ్రత శిరోద్కర్ నటించింది. 2000లో విడుదలైన వంశీ చిత్రంలో మహేష్-నమ్రత జతకట్టారు. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన వంశీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
సినిమా ఫెయిల్ అయినా మహేష్-నమ్రత లవ్ స్టోరీ హిట్ అయ్యింది. నమ్రత శిరోద్కర్ ని మహేష్ ప్రేమించాడు. ఆమె కూడా మహేష్ ని ఇష్టపడ్డారు. ఐదేళ్లు వీరి రహస్య ప్రేమాయణం సాగింది. ఆ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం లేదు. దాంతో మహేష్-నమ్రతల లవ్ ఎఫైర్ బయటకు రాలేదు. 2005లో మహేష్-నమ్రత రహస్య వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరయ్యారు.
మహేష్ పెళ్లి వార్త అభిమానులను షాక్ కి గురి చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా జరిగిన పెళ్లి కావడంతో అందరి మైండ్ బ్లాక్ అయ్యింది. పెళ్ళికి ముందే నమ్రత మహేష్ కి వాగ్దానం చేసిందట. వివాహం అనంతరం నటనకు గుడ్ బై చెబుతాను అన్నారట. ఇచ్చిన మాట ప్రకారం నమ్రత నటించలేదు. 2004 తర్వాత నమ్రత సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది లేదు.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నమ్రత నటించనుందట. ఆమె కమ్ బ్యాక్ ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఓ యంగ్ హీరో మూవీలో నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర ఆమె చేస్తున్నారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. కాగా రేణు దేశాయ్ సైతం పవన్ కళ్యాణ్ తో వివాహం అనంతరం నటనకు ఫుల్ స్టాప్ పెట్టింది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆమె నటించలేదు. ఇటీవల టైగర్ నాగేశ్వరరావు మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నమ్రత సైతం రేణు దేశాయ్ వలె సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీకి అవుతన్నారని అంటున్నారు. నమ్రత ఒట్టు తీసి గట్టు మీద పెట్టి మహేష్ కి ఝలక్ ఇచ్చిందని అంటున్నారు.