https://oktelugu.com/

Namrata Shirodkar: మహేష్ ని మొదట ప్రేమించలేదు… బాంబు పేల్చిన నమ్రత శిరోద్కర్!

Namrata Shirodkar: ఆల్ట్రా మోడ్రన్ సొసైటీలో బ్రతికి వచ్చిన నమ్రత శిరోద్కర్ తెలుగింటి కోడలిగా ప్రయాణం సాగిస్తుందని ఎవరూ ఊహించలేదు. సినిమా, కెరీర్ వదిలేసి నమ్రత గృహిణిగా మారిపోయింది.

Written By: , Updated On : July 1, 2024 / 10:46 AM IST
Namrata Shirodkar revealed marriage with Mahesh Babu behind truth

Namrata Shirodkar revealed marriage with Mahesh Babu behind truth

Follow us on

Namrata Shirodkar: మహేష్ బాబు-నమ్రత టాలీవుడ్ లవ్లీ కపుల్ గా ఉన్నారు. ఈ జంట పెళ్లి బంధంలో అడుగుపెట్టి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ల మహేష్-నమ్రత విభేదించిన దాఖలాలు లేవు. ఒక ఆల్ట్రా మోడ్రన్ సొసైటీలో బ్రతికి వచ్చిన నమ్రత శిరోద్కర్ తెలుగింటి కోడలిగా ప్రయాణం సాగిస్తుందని ఎవరూ ఊహించలేదు. సినిమా, కెరీర్ వదిలేసి నమ్రత గృహిణిగా మారిపోయింది. ఇద్దరు పిల్లల్ని కని వారిని పెంచి పెద్ద చేసే బాధ్యత తీసుకుంది. సితార, గౌతమ్ కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక మహేష్ కి సలహాదారుగా మారింది నమ్రత.

కాగా ఓ సందర్భంలో మహేష్ తో తన లవ్ స్టోరీ బయటపెట్టింది. అందరూ అనుకుంటున్నట్లు మాది లవ్ యట్ ఫస్ట్ సైట్ కాదని ఆమె బాంబు పేల్చారు. మహేష్ ని చూడగానే ప్రేమలో పడలేదు అన్నారు. నమ్రత మాట్లాడుతూ… నేను మహేష్ వంశీ షూటింగ్ కోసం మొదటిసారి కలిశాము. అప్పుడు మాకు పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారింది. ఈ క్రమంలో ఒకరినొకరం అర్థం చేసుకున్నాము. అప్పుడు మాకు ప్రేమ భావన కలిగింది. ప్రేమికులుగా కొన్నాళ్ళు ప్రయాణం చేశాము. పెళ్లి గురించి చర్చించుకుని తర్వాత వివాహం చేసుకున్నామని… అన్నారు.

ఇక మహేష్ నాతో ఉంటే ప్రపంచం తెలియదు. ఇద్దరం ఏకాంతంలో మునిగిపోతాము. మాకు మూడో వ్యక్తి అవసరం కూడా ఉండదని ఆమె ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను తెలియజేశారు. మహేష్ బాబు ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఖాళీ సమయాన్ని కేవలం కుటుంబానికి కేటాయిస్తారు. చాలా అరుదుగా ప్రైవేట్ పార్టీలు, స్టార్ ఈవెంట్స్ కి హాజరవుతారు. ప్రతి ఏడాది రెండు మూడు సార్లు విదేశాలకు కుటుంబంతో పాటు విహారానికి వెళతారు.

అమెరికా, ఫ్రాన్స్, దుబాయ్ మహేష్ ఫ్యామిలీ ఫేవరేట్ టూరిస్ట్ స్పాట్స్. ప్రస్తుతం మహేష్ తన నెక్స్ట్ మూవీకి సిద్ధం అవుతున్నారు. మొదటిసారి ఆయన దర్శకుడు రాజమౌళితో మూవీ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుంది. హాలీవుడ్ హిట్ సిరీస్ ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే హింట్ ఇచ్చారు. దాదాపు రూ. 800 కోట్ల వ్యయంతో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది.