Chandrababu : తెలవారకముందే ఆ ఇంట్లోకి చంద్రబాబు.. వాళ్లకు షాక్

Chandrababu వికలాంగులకు సంబంధించి పింఛన్ మొత్తం భారీగా పెరిగింది. గతంలో మూడు వేల రూపాయల పింఛన్ అందేది. దానిని 6 వేలకు పెంచుతూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది.

Written By: Dharma, Updated On : July 1, 2024 10:44 am

Chandrababu Pension

Follow us on

Chandrababu : రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేడుకగా ఆరంభమైంది. పండగ వాతావరణంలో జరిగింది. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కార్యక్రమం కావడంతో మూడు పార్టీల శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ స్వయంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో కొద్దిసేపటి కిందటే స్వయంగా అర్హుల ఇళ్లకు వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేశారు. టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మేళ తాళాలు, యువత సందడి నడుమ పెనుమాకలో కోలాహలం నెలకొంది.

అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ మొత్తాన్ని మూడు వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నుంచి వర్తింప చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు.. పింఛన్ లబ్ధిదారులకు 7000 రూపాయలు అందించే వీలుగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 65.31 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు.ఇప్పటివరకు మూడు వేల రూపాయలు పింఛన్ మొత్తం లబ్ధిదారులకు అందేది.ఈ నెల నుంచి 1000 పెంచుతూ నాలుగు వేలు అందించనున్నారు.గతంలో వాలంటీర్లు ఇంటింటికి అందజేసేవారు. ఇప్పుడు ఆ బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు చంద్రబాబు.

వికలాంగులకు సంబంధించి పింఛన్ మొత్తం భారీగా పెరిగింది. గతంలో మూడు వేల రూపాయల పింఛన్ అందేది. దానిని 6 వేలకు పెంచుతూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారినపడి వీల్ చైర్ కు పరిమితమైన వారికి చెల్లించే పింఛన్ మొత్తం కూడా భారీగా పెరిగింది. గతంలో ప్రతినెల వారికి ఐదు వేల రూపాయలు అందిస్తుండగా.. ఇప్పుడు దానిని 15 వేల రూపాయలకు పెంచారు. కిడ్నీ కాలేయం గుండె మార్పిడిచేయించుకున్న వారికి చెల్లించే పింఛన్ మొత్తం ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచింది ప్రభుత్వం.కేవలం సామాజిక భద్రత కింద అందించే పింఛన్లకు యాట 33 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధపడటం విశేషం.తొలిరోజుసీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందించడం ఆకట్టుకుంది.రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీతో సందడి వాతావరణం నెలకొంది.