GodFather Najabhaja Song : మెగాస్టార్ చిరంజీవి ఫుల్ మాస్ లుక్ లో నటిస్తున్న మూవీ ‘గాడ్ ఫాదర్’. బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ మూవీ హిందీలో కూడా విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ‘రాజకీయం’ అన్న డైలాగ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది.

సల్మాన్ ఖాన్ తో కలిసి డ్యాన్స్ చేసిన ఊపు తగ్గకముందే తాజాగా ‘గాడ్ పాదర్’ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది. ‘నజభజజజర’ అంటూ సాగే ఈ ఫైరింగ్ పాట గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉంది. చిరంజీవి గన్ చేత పట్టి ప్రత్యర్థులను చంపేస్తున్న విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సాంగ్ లో చిరంజీవి మేనరిజం, స్టైలింగ్, గన్ తో కాల్చే సన్నివేశాలు చూస్తే మెగా అభిమానులకు ఫుల్ కిక్ వచ్చినట్టు అవుతోంది.
థమన్ సంగీతం అందించిన ఈ పాట గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగుతున్నట్టు అర్థమవుతోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధానకర్షణగా మారింది. శ్రీకృష్ణ, పృథ్విచంద్ర ఆలపించారు. చూస్తుంటే ఈ పాట సినిమాలో మేజర్ అట్రాక్షన్ గా మారుతుందని అనిపిస్తోంది. విడుదలైన కాసేపటికే పాట వైరల్ గా మారింది.
దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఫైనల్ కట్ పూర్తయ్యిందని.. ఫైనల్ కాపీని మెగాస్టార్ చూసి అద్భుతంగా వచ్చిందని ఎక్సైట్ అయినట్టు తెలుస్తోంది. సినిమా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ తో చెప్పినట్టు తెలిసింది. దర్శకుడిని అభినందించినట్టు సమాచారం.
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని సూపర్ గూడ్ ఫిలింస్, కొణిదెల మూవీ కంపెనీ నిర్మించాయి. థమన్ సంగీతం అందించారు. సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు ఇది తెలుగు రిమేక్. 28న సాయంత్రం అనంతపురంలో సినిమా ప్రీరిలీజ్ వేడుక నిర్వహిస్తున్నారు.