Bigg Boss 6 Telugu Vote Result: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీసన్ 6 ఇటీవలే ఘనంగా ప్రారంభమై విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకొని నాల్గవ వారం లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రారంభం లో నత్త నడకన సాగిన బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఊపందుకొని మంచి TRP రేటింగ్స్ సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది..గత వారం హౌస్ నుండి నేహా ఎలిమినేట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వారం బిగ్ బాస్ చరిత్ర లో మొట్టమొదటిసారిగా హోస్ట్ నాగార్జున గారు కీర్తి మరియు అర్జున్ లను నేరుగా హౌస్ నుండి బయటకి వెళ్లిపోవడానికి నామినేట్ చేసాడు..వీళ్లిద్దరు కాకుండా నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో రేవంత్ ,ఇనాయ సుల్తానా, శ్రీహాన్ ,గీతూ, రాజ్ శేఖర్, సుదీప ,సూర్య మరియు ఆరోహి నామినేట్ అయ్యారు..అయితే గడిచిన మూడు వారాలతో పోలిస్తే ఈ వారం లో వోటింగ్ మొత్తం తారుమారైంది.

ఈ వారం అందరికంటే అత్యధిక ఓట్లతో రేవంత్ కొనసాగుతుంటే ఆయన తర్వాతి స్థానం ని దక్కించుకుంది ఇనాయ సుల్తానా..ఇది నిజంగా ఎవ్వరు ఊహించలేదనే చెప్పాలి..మొదటి వారం లో నామినేషన్స్ లోకి వచ్చిన ఇనాయ సుల్తానా అందరికంటే తక్కువ వోట్లని దక్కించుకుంది..అదృష్టం కొద్దీ మొదటి వారం ఎలిమినేషన్స్ పెట్టలేదు కాబట్టి సరిపోయింది..లేకపోతే ఇనాయ సుల్తానా ఎలిమినేట్ అయ్యేది..తనకి వచ్చిన ఆ అదృష్టం ని సరిగ్గా వాడుకొని అద్భుతంగా టాస్కులు ఆడుతూ తన గ్రాఫ్ ని బాగా పెంచుకుంది..ఇప్పుడు మూడవ వారం లో హౌస్ లో అందరి కంటెస్టెంట్స్ ని అధిగమించి రెండవ స్థానం లో కొనసాగుతుంది అంటే రోజు రోజుకి ఆమెకి పెరుగుతున్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ వారం ఎలిమినేషన్ కూడా ఎవ్వరు ఊహించని కంటెస్టెంట్ ఆరోహి ఎలిమినేట్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది..ప్రస్తుతం అతి తక్కువ ఓట్లతో కొనసాగుతున్న కంటెస్టెంట్ ఆమెనే..అర్జున్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి..ఈ ఇద్దరి మధ్య స్వల్ప ఓట్ల తేడానే ఉంది..మరి ఈ వారం లో వీళ్లిద్దరు బాగా ఆడితే వోటింగ్స్ మారే అవకాశం కూడా ఉంది.