Jabardasth murthy passed : బుల్లితెరపై విషాదం నెలకొంది. ప్రముఖ జబర్ధస్త్ నటుడు మృతిచెందాడు. ఈటీవీలో వచ్చే జబర్ధస్త్ షో ద్వారా పాపులర్ అయిన అతడు ఇక లేడన్న వార్తను జబర్ధస్త్ కమెడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అతడు చేసిన స్కిట్ లు, కామెడీని తలుచుకొని కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు.

జబర్ధస్త్ తొలినాళ్లలో అనేక స్కిట్లలో చేసిన కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ మూర్తి ఈరోజు కన్నుమూశారు. మిమిక్రీతో జబర్ధస్త్ స్టేజీపై ఓ వెలుగు వెలిగిన మూర్తి మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచాడు. మూర్తిని కేన్సర్ కబళించిందని ఆయన సోదరుడు అరుణ్ స్వయంగా తెలిపారు.
జబర్ధస్త్ కమెడియన్ మూర్తి గురించి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే.. మిమిక్రీతో జబర్ధస్త్ లో బయట వేడుకలు, సినిమాల్లో ఎన్నో ప్రదర్శనలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా మూర్తి ‘ప్యాంక్రియాస్’ కేన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ మహమ్మారి నుంచి బయటపడడానికి ఎన్నో ఆస్పత్రులు తిరిగినా నయం కాలేదు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన చివరకు ప్రాణాలు వదిలారు.

2018 వరకూ మూర్తి జబర్ధస్త్ లో అలరించారు. చలాకీ చంటి సహా పలువురి స్కిట్ లలో చేసేవాడు. మూడేళ్ల క్రితం మూర్తికి క్యాన్సర్ అని తేలింది. వైద్యం కోసం దాదాపు 16 లక్షలు ఖర్చు చేశాడు. చాలా మంది దాతలు కూడా మూర్తి కోసం చేతనైనా సాయం చేశారు. అయినా లాభం లేకుండా పోయింది. 16 లక్షలు ఖర్చు అయ్యాయని ఆదుకోవాలని జబర్ధస్త్ కమెడియన్స్ కు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని ఓ ఇంటర్వ్యూలో మూర్తి కన్నీళ్ల పర్యంతం అయ్యాడు.
ఇక హైపర్ ఆది, గెటప్ శ్రీనులతో మూర్తికి అనుబంధం ఉంది. మొదట్లో వేణు స్కిట్ లో చేసేటప్పుడు సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి పలు స్కిట్లను మూర్తి చేశాడు. మూర్తి లేడన్న వార్తతో సుధీర్, శ్రీను విషాదంలో మునిగిపోయారు.