Nagarjuna: ఒకప్పుడు తెలుగులో అమ్మాయిలు విపరీతంగా ఇష్టపడే హీరో ఎవరు అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు అక్కినేని నాగార్జున. మన కింగ్ చాలా రోజులపాటు అమ్మాయిల రాకుమారదుగా కొనసాగారు. అలాంటి ఈ హీరో కెరియర్ లో అమ్మాయిలకు విపరీతంగా నచ్చిన సినిమాలలో ఒకటి మన్మధుడు. ఈ సినిమా నాగార్జున కెరియర్ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు అవుతూ ఉండగా ఆ సినిమా విడుదలైన రోజుల్లో నాగార్జున చేసిన మోసం ఇప్పుడు బయటపడింది. అంతేకాదు నాగార్జున ఇంత పెద్ద మోసం చేశారా అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది.
అసలు విషయానికి వస్తే సినిమాలో చిన్న సీన్.. చిన్న ట్యూన్ ని కూడా చాలా ఎనలైజ్ చేస్తారు మన నెటిజెన్స్.
ఒకవేళ సినిమా దర్శకుడు లేదా మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఏదైనా సాంగ్ లేదా సీన్ కాపీ కొడితే.. .. అది ఏ మూవీలోంచి తీసుకొచ్చారో క్షణాల్లో బయటపెట్టేస్తున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక ఇప్పుడు అలానే మన్మధుడు బాగా ఫేమస్ అయిన ఒక సీన్ గురించి బయటకి వచ్చింది.
మన్మథుడు సినిమాలోని పారిస్ సీన్, నాగార్జున బ్రిడ్జి దాటే సీక్వెన్స్ మనందరికీ గుర్తుండేదే. కానీ ఆ సీన్ అసలు పారిస్‌లోనే జరగలేదట. ఆ ప్లేస్ పారిస్‌లోనే లేదట. అది ఆస్ట్రియాలో ఉందట. అంటే 20 ఏళ్ల క్రితం ఆస్ట్రియాను ప్యారిస్ అని చెప్పి జనాలను భలే మోసం చేసేశాడు నాగార్జున అండ్ టీం. మొత్తానికి నీళ్లంటే భయం, ఆ బ్రిడ్జ్ దాటను అని నాగార్జున అనే సీన్ లో ఉందే బ్రిడ్జ్ ప్యారిస్‌లో లేదట. ఆస్ట్రియాలో ఉందట.
మామూలుగా అయితే ఇలాంటి మోసాలు సినిమా వాళ్లు చేస్తూనే ఉంటారు. ఎక్కడో విదేశాలు అని చెబుతారు.. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలోనే కానిస్తారు. కొన్నిసార్లు గ్రాఫిక్స్ వారేస్తారు. ఇక ఇలానే మన్మధుడు సినిమాలో దర్శకుడు ఇక నాగార్జున చేసే మోసం ఇప్పుడు గమనించిన నేటిజన్స్ దాన్ని షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.