India Vs Australia: ఏషియా కప్ ఫైనల్ లో ఇండియా ఘన విజయం సాధించింది.ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా తో మూడు వన్డే ల సిరీస్ కి భారత జట్టు ని ఇండియన్ టీం చీప్ సెలెక్టర్ అయినా అజిత్ అగార్కర్ కొంతమంది ప్లేయర్ల పేర్లని ప్రకటించడం జరిగింది.నిజానికి ఈ మూడు మ్యాచ్ ల కోసం రెండు టీం లను సెలెక్ట్ చేయడం జరిగింది.మొదటి రెండు మ్యాచ్ లకి ఒక టీం మిగిలిన ఆడితే, మూడో మ్యాచ్ కోసం ఇంకొక టీం అందుబాటు ఉంటుంది.ప్రస్తుతం ఈ టీంలో సీనియర్ ప్లేయర్లు అయినా రోహిత్ శర్మ,హార్దిక్ పాండ్య,విరాట్ కోహ్లీ,జస్ప్రీత్ బుమ్రా,కుల్దీప్ యాదవ్ లకి మొదటి రెండు మ్యాచుల్లో రెస్ట్ ఇస్తున్నారు.
నిజంగా మాట్లాడుకోవాలంటే ఏషియా కప్ లో మనవాళ్ళు ఎన్ని మ్యాచులు ఆడారు. లీగ్ స్టేజ్ లో పాకిస్థాన్ తో ఆడిన మొదటి మ్యాచ్ వర్షం కారణం గా రద్దు అయింది.ఇక రెండు మ్యాచ్ నేపాల్ మీద ఆడారు గెలిచారు.సూపర్ 4 లో మళ్లీ పాకిస్థాన్ మీద ఆడిన మ్యాచ్ లో వర్షం కారణం గా అది కూడా రెండు రోజులు ఆడారు.ఆ తరువాత శ్రీలంక తో ఒక మ్యాచ్ ఆడారు, బాంగ్లాదేశ్ తో ఒక మ్యాచ్ ఆడి ఓడిపోయారు.ఫైనల్ లో శ్రీలంక మీద మ్యాచ్ ఆడినప్పటికీ అది పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు నార్మల్ గా ముగిసిపోయింది.ఇక ఇలాంటి టైం లో మన ప్లేయర్లు గట్టిగా కొడితే ఏషియా కప్ లో రెండు మ్యాచులు మాత్రమే ఆడారు.దానికి ఆస్ట్రేలియా మ్యాచ్ లో సీనియర్లకు రెస్ట్ ఇవ్వడం దేనికి పైగా ఈ మ్యాచుల తర్వాత డైరెక్ట్ గా ఇండియా వరల్డ్ కప్ మ్యాచులు ఆడుతుంది.కాబట్టి ఇలాంటి టైం లో బాగా ఆడే ప్లేయర్లను పక్కన పెడితే వాళ్ళలో ఉన్న ఆ రిథమ్ మిస్ అవుతుంది.అయితే జూనియర్ ప్లేయర్లని పరీక్షించడం లో తప్పు లేదు కానీ ఇలాంటి క్రిటికల్ టైం లో బాగా ఆడే ప్లేయర్లను పక్కన కూర్చోపెట్టడం కరెక్ట్ కాదు అనేది అందరి వాదన…అయితే మూడో వన్డే కి వీళ్లు అందుబాటు లోకి వచ్చినప్పటికీ అది పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించదు కాబట్టి వీళ్ళని పక్కన పెట్టి బిసిసిఐ చాలా తప్పు చేస్తుంది…
ఇక మొదటి రెండు వన్డేలకు గాయం కారణంగా అక్షర్ పటేల్ ని పక్కన కూర్చోబెట్టారు.వాషింగ్ టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్,తిలక్ వర్మకి అవకాశం ఇవ్వడం మంచిదే…కానీ విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ,హార్దిక్ పాండ్య లని మూడు మ్యాచుల్లో ఆడనిస్తే బాగుండేది…ఇప్పుడు మ్యాచ్ చూసే వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే రోహిత్ శర్మ, కోహ్లీ, హార్దిక్ పాండ్య, బుమ్రా, కుల్దీప్ యాదవ్ లు మాత్రమే ఫ్రెష్ గా ఉండాలా వాళ్ళకి మాత్రమే విశ్రాంతి ఇస్తారా మిగిలిన వాళ్ళకి విశ్రాంతి అవసరం లేదా అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇక ఇది ఇలా ఉంటె ఈనెల 22 న మొహాలీ వేదిక గా ఆస్ట్రేలియా తో మొదటి వన్స్ ఆడనుంది, 24 న ఇండోర్ వేదికగా రెండో వన్డే, 27 న రాజ్ కోట్ వేదిక గా మూడో వన్డే ఆడనున్నారు…