https://oktelugu.com/

Gangavva & Nagarjuna : ‘గంగవ్వ’ పై విరుచుకుపడిన నాగార్జున..ఆమెను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి పంపే ముందు ఇంత రచ్చ జరిగిందా?

ఈ సీజన్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో ఒకరిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన 'గంగవ్వ' గత వారం ఆరోగ్య సమస్యల కారణంగా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని బయటకి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎలిమినేషన్ వెనుక చాలా పెద్ద కారణాలు ఉన్నాయని తెలుస్తుంది

Written By:
  • Vicky
  • , Updated On : November 12, 2024 / 04:39 PM IST

    Nagarjuna who lashed out at 'Gangavva'..was there such a fuss before she was sent out of the Bigg Boss house?

    Follow us on

    Gangavva & Nagarjuna : ఈ సీజన్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో ఒకరిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ‘గంగవ్వ’ గత వారం ఆరోగ్య సమస్యల కారణంగా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని బయటకి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎలిమినేషన్ వెనుక చాలా పెద్ద కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే గంగవ్వ కారణంగా ఈ సీజన్ లో పెద్దగా కంటెంట్ వచ్చింది ఏమి లేదు. టాస్కులు ఆమె ఎలాగో ఆడదు, ఈమె మీద నామినేషన్స్ కూడా ఎవ్వరూ వెయ్యరు. ఈమె నామినేషన్స్ వేసేటప్పుడు కూడా పెద్దగా పాయింట్స్ ఏమి ఉండట్లేదు. షో కి ఈమె వల్ల నష్టం తప్ప నయాపైసా ఉపయోగం లేదు. పైగా ఈమెకు బదులుగా గేమ్స్ బాగా ఆడే కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ ఉన్నారు. ఫలితంగా టీఆర్ఫీ రేటింగ్స్ పడిపోతున్నాయి. అందుకే గత వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి గంగవ్వ ని బయటకి పంపేశారు. ఆ మరుసటి రోజు హరితేజ కూడా ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

    అయితే ఎలిమినేట్ చేసే ముందు నాగార్జున, గంగవ్వకి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఫుటేజీ మొత్తాన్ని బిగ్ బాస్ టీం తొలగించారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘గంగవ్వ’ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన తర్వాత, ఆ షోకి వచ్చిన ఆడియన్స్ ని కాసేపు బయటకి పంపించారట. వాళ్ళను బయటకి పంపిన తర్వాత నాగార్జున ‘గంగవ్వ’ తో మాట్లాడుతూ, ఉన్న వాస్తవ విషయాలను వివరించి సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వాల్సిందిగా ఆదేశిస్తాడట. కానీ గంగవ్వ అందుకు ఒప్పుకోలేదట. నేను నామినేషన్స్ లోకి రాలేదు, ఒకవేళ వచ్చినా నన్ను ఆడియన్స్ సేవ్ చేస్తారు, అంతటి ప్రజాధారణ నాకు ఉంది. నన్ను ఆడియన్స్ బయటకి పంపేవరకు నేను ఈ షో నుండి వెళ్ళను అని చాలా స్ట్రాంగ్ గా నాగార్జున కి చెప్పిందట. నాగార్జున ఆమెని సముదాయించడానికి చాలా ప్రయత్నమే చేసాడట. చివరికి గంగవ్వ ఒక షరతు మీద సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడానికి ఒప్పుకుందట.

    నా మనవరాలికి కూడా ఇల్లు కట్టిస్తాను అని మాట ఇస్తే, నేను ఈ షో నుండి బయటకి రావడానికి సిద్ధం అని చెప్పిందట. నాగార్జున అందుకు ఒప్పుకోలేదట, నువ్వు అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తున్నాం, అంతకు మించి ఏమి చెయ్యాలి, ప్రతీసారి ఇల్లు కట్టించమని అడగడం సరికాదు, నీకు బిగ్ బాస్ టీం రెండవసారి అవకాశం ఇచ్చినందుకు నువ్వు కృతజ్ఞతగా ఉండాలి అని చెప్పాడట నాగార్జున. చివరికి ఎలాగోలా ఆమెని సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యేందుకు ఒప్పించాడు నాగార్జున. ఈ చర్చ మొత్తం సుమారుగా గంటసేపటి వరకు జరిగిందట. ఆ తర్వాత ఆడియన్స్ అందరిని లోపలకు పిలిపించారు. గంగవ్వ తో అంతసేపు హీట్ వాతావరణం లో చర్చలు జరపడం వల్ల నాగార్జున కాస్త నిరాశకి గురి అయ్యాడని. అందుకే ఆమెని స్టేజి మీదకు కూడా పిలవకుండా బయటకి పంపేశారని తెలుస్తుంది. ఇదంతా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న కథనం మాత్రమే, ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.