Bigg Boss 9 Telugu Contestant : ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్న రియాల్టీ షోలో బిగ్ బాస్ షో మొదటి స్థానంలో ఉంది. టెలివిజన్ రంగంలోనే అత్యంత హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్లిన ఈ షో ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదో సీజన్ కోసం హోస్ట్ గా నాగార్జున మరోసారి బరిలోకి దిగబోతున్నాడు. ఇక వచ్చేనెల నుంచి స్టార్ట్ అవ్వబోతున్న ఈ షో గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతోంది.అయితే గత ఎనిమిది సీజన్లో టాప్ కంటెస్టెంట్ కి వీక్లీ హైయెస్ట్ పేమెంట్ ని ఇస్తూ వస్తున్నారు. మరి ఈ సీజన్ కోసం ఒక సినిమా సెలబ్రిటీని తీసుకోస్తున్నారట.అతనికి వీక్ లోనే అత్యంత హైయెస్ట్ పేమెంట్ ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఒక వీక్ కి నాలుగు లక్షల వరకు అతనికి పే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ఎక్కువ వారాలపాటు హౌజ్ లో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారట.
Also Read: బిగ్ బాస్ 9 లో కాంటెస్టెంట్ గా రాబోతున్న ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో…
మరి ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ షో లో టాప్ కంటెస్టెంట్లు ఎక్కువ రోజులపాటు ఉంటే టిఆర్పి రేటింగ్ అనేది భారీగా పెరుగుతోంది.ఒకవేళ ఆ కంటెస్టెంట్లు కనుక ఎలిమినేట్ అయిపోతే వాళ్ళ అభిమానులు అది జీర్ణించుకోలేక షో ని చూడటం మానేస్తారు. కాబట్టి టాప్ కంటెస్టెంట్ కి టాప్ రేంజ్ లో రెమ్యూనరేషన్ ను ఇస్తూనే అతన్ని చివరి వరకు కొనసాగే ప్రయత్నం చేస్తూ వస్తుంటారు…
మరి ఈసారి టాప్ కంటెస్టెంట్ గా ఎవరు రాబోతున్నారు ఏ హీరోని హౌజ్ లో బాగం చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక వీక్లీ 4 లక్షల రూపాయలను ఇవ్వడానికి కూడా బిగ్ బాస్ యాజమాన్యం సిద్ధపడింది అంటే ఆ సెలబ్రిటీ ఎవరో టాప్ రేంజ్ లో ఉంటారనే అభిప్రాయాలైతే వెలువడుతున్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఆయన షోలో పర్ఫామెన్స్ ని ఇస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
Also Read: అగ్ని పరీక్ష లో కష్టాలు కన్నీళ్లు చెబితే సెలెక్ట్ చేయరు…వాళ్ళకి ఏం కావాలంటే..?
ఇక ఒక కంటెస్టెంట్ మీద వీక్లీ అంత పే చేస్తే వీళ్ళకేం వస్తుందని చాలామంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒక టాప్ కంటెస్టెంట్ ఉండటం వల్ల టిఆర్పి రేటింగ్ పెరిగితే ఆటోమేటిక్ గా షో టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతోంది. బిగ్ బాస్ షో కి ఆడ్స్ రూపం లో భారీగా డబ్బులు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి షో బ్రాండ్ వాల్యూ పెరగడమే కాకుండా ఛానెల్ కి కూడా అది చాలా వరకు హెల్ప్ అవుతోందనే ఉద్దేశంతోనే వాళ్ళు అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు…