Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi) పుట్టినరోజు నేడు. తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటున్నారు. దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు సైతం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అన్నయ్యకు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక సామాజిక సేవా కార్యక్రమాల గురించి చెప్పనవసరం లేదు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు, రోగులకు పండ్ల పంపిణీ వంటివి కొనసాగుతున్నాయి. సినీ రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ కు తిరిగి స్పందించారు చిరంజీవి. ఓ ట్వీట్ కూడా చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతోంది ఆ ట్వీట్.
Also Read: జగన్ తో షర్మిల భేటీ?
* విశ్వంభరుడు అన్నయ్య..
పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ వ్యక్తిగా ఎదిగి.. స్వయంకృషికి పర్యాయపదంగా నిలిచిన, విశ్వంభరుడు, అన్నయ్య పద్మ విభూషణ్ శ్రీ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవిగా ప్రేక్షక లోకాన్ని రంజింపజేసిన ధ్రువతారగా వెలుగు అందుతున్న మా అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టం అయితే.. ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం. వెలకట్టలేని జీవిత పాఠం. ఒక సాదాసీదా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా విజయాలు సాధించి.. ఎల్లలు దాటి కీర్తి ప్రతిష్టలు సాధించడం నాకే కాదు నాలాంటి ఎందరికో స్ఫూర్తి. చిరంజీవి గారు కీర్తికి పొంగిపోలేదు. కు విమర్శలకు కృంగిపోను లేదు. విజయాన్ని వినమ్రతతోను, అపజయాన్ని సవాలుగా స్వీకరించే పట్టుదల ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. అన్నింటినీ భరించే శక్తి ఆయన నైజం. అందుకే ఆయన విశ్వంభరుడు. పితృ సమానుడైన అన్నయ్యకు, మాతృ సమానురాలైన వదినకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుష్షుతో కూడిన ఆరోగ్య సంపదను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను ‘ వన్ టూ పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
* చిరు హార్ట్ టచ్ ట్విట్
పవన్ ట్వీట్ పై తనదైన రీతిలో స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ‘ జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు. తమ్ముడు కళ్యాణ్ ప్రేమతో పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతి మాట.. ప్రతి అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వు ఎంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాలను, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షిత, పట్టుదల చూసి ప్రతిక్షణం గర్వపడుతూనే ఉన్న. నిన్ను నమ్మిన వాళ్లకు ఏదో చేయాలన్న తప్పనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది. ఈరోజు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతో ఉంటాయి. నీ ప్రతి అడుగులోనూ విజయం నిన్ను వరించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ చిన్నతనంలో ఉన్నప్పుడు చిరంజీవి బర్త్డే వేడుకలకు సంబంధించిన ఫోటోలను జత చేశారు.
* చంద్రబాబు విషెస్..
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) సైతం చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ప్రజలకు సేవ చేయడంలో, దానధర్మాలు చేయడంలో ముందుండే వారు. ఇది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. మీ దాతృత్వంతో, అంకిత భావంతో మీరు ఎల్లప్పుడూ ప్రజల జీవితాలను తాకుతూ ఉండాలని కోరుకుంటున్నాను. చిరంజీవి గారు మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని, మరెన్నో సంవత్సరాలు ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం’ అంటూ పోస్ట్ చేశారు చంద్రబాబు.
జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు!
తమ్ముడు కల్యాణ్…
ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా… pic.twitter.com/UMN5vu3nqZ
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 22, 2025