Nagarjuna Simon: కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ‘కూలీ'(Coolie Movie) చిత్రం లో విలన్ క్యారక్టర్ చేసి అందరినీ షాక్ కి గురి చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే నాగార్జున ఇలాంటి రోల్ చేయడం పై అక్కినేని ఫ్యాన్స్ చాలా తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయన క్యారక్టర్ ని బాగానే చూపించారు కానీ, సెకండ్ హాఫ్ లో పూర్తిగా డౌన్ చేసారని, హీరో ముందు నాగార్జున వీక్ విలన్ లాగా అనిపించాడని అభిమానులు మండిపడ్డారు. పలు చోట్ల ఆయన కోసం వేసిన బ్యానర్స్ ని కూడా కోపం తో ఫ్యాన్స్ చింపివేసారు. దయచేసి ఇలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ చేయకండి అంటూ అభిమానులు నాగార్జున ని ట్యాగ్ చేసి బ్రతిమిలాడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే నాగార్జున రేంజ్ ఏంటో , ఆయనని కరెక్ట్ గా పది నిమిషాలు బాగా చూపించినా జనాలు ఆయన గురించి ఎలా మాట్లాడుకుంటారో చెప్పడానికి సైమన్ క్యారక్టర్ మరో ఉదాహరణగా నిల్చింది.
Also Read: ఖైదీ 2′ ని పక్కన పెట్టిన లోకేష్ కనకరాజ్..క్రేజీ మల్టీస్టార్రర్ వైపు మొగ్గు!
ఫస్ట్ హాఫ్ లో నాగార్జున ని లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) చూపించిన విధానం కి థియేటర్స్ లో ఫ్యాన్స్ నిజంగా మెంటలెక్కిపోయారు. ఆ క్యారక్టర్ సెకండ్ హాఫ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్తుందని అంతా అనుకున్నారు. అలా ఊహించి అసంతృప్తి కి గురి అయ్యారు కానీ, ఫస్ట్ హాఫ్ లో నాగార్జున ని లోకేష్ కనకరాజ్ చూపించినంత స్టైలిష్ గా, గడిచిన రెండు దశాబ్దాలలో నాగార్జున ని మన టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు అనేది వాస్తవం. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ తెరిచి చూస్తే చాలు, తమిళ ఆడియన్స్ నాగార్జున సైమన్ క్యారక్టర్ కి సంబంధించిన ఆ షాట్స్ ని ఉపయోగించి ఎన్నో వందల మీమ్స్ ని తయారు చేసి అప్లోడ్ చేస్తున్నారు. ముఖ్యంగా నేటి తరం అమ్మాయిలు అయితే ఇన్ స్టాగ్రామ్ లో నాగార్జున ని చూసి పిచ్చెక్కిపోతున్నారు.
Handsome is the word! #SunMusic #HitSongs #Kollywood #Tamil #Songs #Music #NonStopHits #Nagarjuna #Coolie #Ratchagan #ARRahman pic.twitter.com/h1UmvbfIMR
— Sun Music (@SunMusic) August 19, 2025
నాగార్జున వయస్సు ప్రస్తుతం 66 ఏళ్ళు. ఈ వయస్సు లో కూడా ఆయన ఇంత స్టైలిష్ గా,ఇంత అందం గా ఉంటూ, నేటి తరం స్టార్ హీరోలు కూడా సిగ్గుపడేలా చేస్తున్నాడంటే సాధారణమైన విషయం కాదు. ఇలాంటి లుక్స్ ఆయన ఇక మీదట చేసే సోలో హీరో సినిమాల కోసం ఉపయోగించాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నాగార్జున కి సోలో హీరో గా 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఉందని, ఆయన్ని సరిగ్గా వాడుకుంటే సైమన్ పాత్రకి వచ్చినంత రెస్పాన్స్ వస్తుందని, ఇకనైనా మన టాలీవుడ్ డైరెక్టర్స్ నాగార్జున లుక్స్ ని, ఆయన టాలెంట్ ని పూర్తిగా ఉపయోగించుకోవాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆయన అభిమానుల రిక్వెస్ట్ ని ఎంత మేరకు తీసుకుంటాడో చూడాలి.
Assalu Instagram lo em jaruguthundhi raa ayya
Literally every Tamil girl ,meme pages about Nag #Coolie #NagarjunaAkkineni pic.twitter.com/MwbwnIPkVR— Sudheer_DHFM (@Sudheer77728367) August 18, 2025