Nagarjuna: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కెరీర్ లో మైల్ స్టోన్ లాగా నిల్చిపోయిన చిత్రాల్లో ఒకటి ‘శివ'(Shiva Movie Re Release). ఇది ఒక సినిమా కాదు, ఒక చరిత్ర. తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థితి గతులను మార్చేసిన సినిమా ఇది. ఈ చిత్రం విడుదలకు ముందు కేవలం లవ్ స్టోరీస్, ఫ్యామిలీ మూవీస్, మాస్ మసాలా మూవీస్ మాత్రమే ఆడియన్స్ కి తెలుసు. కానీ స్టూడెంట్స్ మరియు మాఫియా బ్యాక్ డ్రాప్ లో, సరికొత్త టేకింగ్ తో, అప్పటి వరకు ఎవ్వరూ చూడని హీరోయిజం యాంగిల్ ని చూపిస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన విశ్వరూపాన్ని చూపించాడు అనే చెప్పాలి. ఈ సినిమా స్థాయి ఎలాంటిదంటే, ఫిలిం స్కూల్స్ లో విద్యార్థులకు దర్శకత్వ శిక్షణ కోసం ఈ సినిమాని చూపించవచ్చు. అలాంటి చిత్రాన్ని సరికొత్త హంగులతో, 4K డిజిటల్ క్వాలిటీ, డాల్బీ అట్మాస్ సౌండ్ తో ఈ నెల 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
Also Read: సుకుమార్ – రామ్ చరణ్ సినిమాలో విలన్ గా నటిస్తున్న స్టార్ హీరో…
ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు కూడా ఒక రేంజ్ లో ప్రొమోషన్స్ చేశారు. కొత్త సినిమాలకు కూడా ఈ స్థాయి ప్రొమోషన్స్ ఇప్పటి వరకు చెయ్యలేదు. అందుకే ఈ చిత్రానికి ఆడియన్స్ లో హైప్ బాగా పెరిగింది. ఫలితంగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. నిన్న అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కలిసి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో నాగార్జున ని విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఒక రిపోర్టర్ ప్రశ్న అడుగుతూ ‘శివ సినిమాని నాగచైతన్య రీమేక్ చేస్తే బాగుంటుందా?, లేదా అఖిల్ చేస్తే బాగుంటుందా?’ అని అడుగుతాడు. దానికి నాగార్జున సమాధానం చెప్తూ ‘వాళ్ళిద్దరికీ ఈ సినిమాని రీమేక్ చేసేంత సీన్ లేదు, సత్తా లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.