Syed Moinuddin: ఆముదం.. ఈ పంటను ఒకప్పుడు వంట నూనెగా వాడేవారు. మన దేశానికి సంబంధించిన సాంప్రదాయ పంట కూడా ఇది. వెనుకటి కాలంలో ఆముదం నూనె ను ఆయుర్వేద ఔషధంగా వాడేవారు. దీనిని ఉపయోగించి రకరకాల మందులు తయారుచేసి.. గాయాలను తగ్గించే లేపనంగా ఉపయోగించేవారు. అంతేకాదు ఎముకలు విరిగిన చోట.. ఈ ఆముదాన్ని పూసి కట్లు కట్టేవారు. పూర్వకాలంలో బాలింత రోగాలు అధికంగా ఉండడం వల్ల.. ఆముదం నూనె, కారంపొడి, వెల్లుల్లి మిశ్రమాన్ని తయారుచేసి వేడివేడి అన్నంలో కలిపి పెట్టేవారు.. దీనివల్ల బాలింతలలో శరీర ఉష్ణోగ్రత పెరిగి.. వ్యాధులు వచ్చేవి కాదు. కాలక్రమంలో ఆముదాలకు డిమాండ్ తగ్గడంతో వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు పంటలు సాగు చేయడం పెరిగింది.
మనదేశంలో ఉత్తర భారత దేశంలోని రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్ వట్టి రాష్ట్రాలలో ఆముదం పంటను సాగు చేస్తున్నారు. సాధారణంగా ఆముదం పంట ద్వారా వచ్చిన నూనెను కందెన(యంత్రాల మధ్య రాపిడిని నివారించడానికి ఒక రకమైన గ్రీజ్) వాడుతుంటారు. అయితే ఇందులో ఒక హానికరమైన పదార్థం ఉంటుంది.. వాస్తవానికి దీని గురించి చాలా వరకు దేశాలకు తెలియదు. ఆముదం పంటమీద లోతుగా పరిశోధన చేసిన వారికి మాత్రమే దాని గురించి తెలుసు. అయితే ఈ విషయాన్ని హైదరాబాద్ ఉగ్రవాది సయ్యద్ మొయినుద్దీన్ చైనాలో ఎంబిబిఎస్ చేస్తున్నప్పుడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఉగ్రమడ్యూల్ లో కలిసిన అనంతరం ఆముదం నుంచి రైసిన్ అని అత్యంత ప్రమాదకరమైన పదార్థాన్ని తయారు చేశాడు.. దీని ద్వారా బయో వార్ చేయాలని సంకల్పించాడు..రైసిన్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. అమెరికా లాంటి దేశాలు దీనిని నిషేధించాయి కూడా. ఇది 0.2 తీసుకుంటే చాలు క్షణాల వ్యవధిలోని మనిషి చనిపోతాడు. పైగా దీనికి ఎటువంటి విరుగుడు అనేది ఉండదు. దీనిని వైద్య పరిభాషలో అత్యంత ప్రమాదకరమైన పదార్థంగా పేర్కొంటుంటారు. ఈ విష పదార్థం ఎముకలను సైతం కరిగిస్తుంది. అక్కడిదాకా ఎందుకు మందమైన కాంక్రీట్ ను సైతం ఇది గుల్ల బారేలా చేస్తుంది.
ఉగ్ర గ్యాంగ్ లో చేరిన సయ్యద్ మోహినుద్దీన్ తన కుట్రలో భాగంగా రైసిన్ తో జనాలు విపరీతంగా ఉండే ప్రాంతాలలో కలిపి బయో వార్ కు పాల్పడేందుకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. దేవాలయాలు.. వాటర్ ట్యాంకులు.. ఫుడ్ సెంటర్ల వంటి ప్రాంతాలలో రైసిన్ కలిపి సామూహిక హత్యలకు పాల్పడాలని ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది.. ఎప్పుడైతే గుజరాత్ ఉగ్రవాద నిరోధక పోలీసు బృందం మొయినుద్దీన్ ను అరెస్టు చేసిందో.. ఆ తర్వాత వీరి ఉగ్ర కుట్ర మొత్తం బద్దలైంది..