Nagarjuna Rajinikanth controversy: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తన సెకండ్ ఇన్నింగ్స్ ని కుబేర(Kuberaa Movie) చిత్రం తో గ్రాండ్ గా మొదలు పెట్టేసాడు. ఇన్ని రోజులు కేవలం హీరో క్యారెక్టర్స్ కి మాత్రమే పరిమితమైన నాగార్జున, కుబేర తో ఇక నుండి క్యారక్టర్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధం అంటూ బహిరంగంగా చెప్పుకొచ్చాడు. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం, నాగార్జున క్యారక్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడం తో , పర్లేదు ఇక మీదట క్యారక్టర్ రోల్స్ చేయొచ్చు, ఎలాంటి రిస్క్ ఉండదు అనే నిర్ణయానికి వచ్చాడు. కుబేర సినిమా చేస్తున్నప్పుడే ఆయన ‘కూలీ'(Coolie Movie) చిత్రం కూడా ఒప్పుకున్నాడు. లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం లో రజనీకాంత్(Superstar Rajinikanth) హీరో గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున మెయిన్ విలన్ క్యారక్టర్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే కుబేర ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు.
Also Read: సోషల్ మీడియా లో పిచ్చ నా కొడుకులు ఎక్కువగా ఉన్నారు – నిర్మాత నాగవంశీ
అలా చెప్పడం పై రజనీకాంత్ ఫ్యాన్స్ తీవ్రమైన ఇబ్బందిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ‘కూలీ’ లో నాగార్జున విలన్ క్యారక్టర్ చేస్తున్నాడు అనే విషయాన్ని విడుదల రోజు వరకు గోప్యం గా ఉంచాలని టీం అనుకుందట. కానీ ఆయన తొందర్లో నోరు జారేశాడని, సినిమాటిక్ థ్రిల్లింగ్ అనుభూతిని చెడగొట్టేసాడని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఆయన క్యారక్టర్ గురించి మాత్రమే కాదు, ఈ సినిమాలో అమీర్ ఖాన్ కూడా నటించాడని, తనతో నాకు కాంబినేషన్ సన్నివేశాలు లేవు కానీ, అమీర్ ఖాన్ పాత్ర మాత్రం అందరినీ షాక్ కి గురి చేస్తుందని, ఇది వరకు ఆయన అలాంటి క్యారక్టర్ చెయ్యలేదని , క్లైమాక్స్ లో కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు నాగార్జున. ఇలా సినిమాలోని కీలక పాత్రల గురించి డైరెక్టర్ అనుమతి లేకుండా నాగార్జున లీక్ చేయడం పై రజనీకాంత్ ఫ్యాన్స్ సంతోషం గా లేరు. మరి దీనిపై నాగార్జున ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Also Read: పోకిరి సినిమాకి డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాదా..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్!
గతం లో చిరంజీవి ఇలాంటి లీక్స్ ఇచ్చేవాడు. చిరు లీక్స్ అనే పదం బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు నాగార్జున కూడా అదే దారిలోకి వచేసాడు. 60 ఏళ్ళు దాటిన తర్వాత సహజం గానే మనుషుల్లో మార్పులు వస్తాయి. మన మైండ్ మన కంట్రోల్ లో ఉండదు, చిరంజీవి, నాగార్జున విషయం లో కూడా అదే జరిగింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే కుబేర లో మంచి పాజిటివ్ క్యారక్టర్ ని చేసి ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించిన నాగార్జున, కూలీ లో విలన్ రోల్ తో ఆడియన్స్ ని ఎలా బయటపెడుతాడో చూడాలి. ఈ చిత్రం లో ఆయన పాత్ర నిడివి 45 నిమిషాల వరకు ఉంటుందట. రోలెక్స్ పాత్ర కంటే చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, అక్కినేని ఫ్యాన్స్ సర్ప్రైజ్ కి గురి అవుతారని అంటున్నారు.