https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున నిర్ణయం వెనుక కారణం ఏమై ఉంటుంది ?

Nagarjuna: బిగ్ బాస్‌- సీజన్ తెలుగు 5 షో లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నినాదం వినిపించింది. ఈ షో లోకి గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టిక‌ర్త‌, టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్‌ ను నాగార్జున సాద‌రంగా ఆహ్వానించారు. అనంతరం కింగ్ నాగార్జున వెయ్యి ఎక‌రాల రిజ‌ర్వు ఫారెస్ట్ ద‌త్త‌త తీసుకుంటాన‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయం వెనుక నాగార్జున అభిరుచి ఉందా ? లేక, మరో కారణం అయినా ఏమైనా […]

Written By:
  • Shiva
  • , Updated On : December 13, 2021 / 11:53 AM IST
    Follow us on

    Nagarjuna: బిగ్ బాస్‌- సీజన్ తెలుగు 5 షో లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నినాదం వినిపించింది. ఈ షో లోకి గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టిక‌ర్త‌, టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు జోగినిప‌ల్లి సంతోష్ కుమార్‌ ను నాగార్జున సాద‌రంగా ఆహ్వానించారు. అనంతరం కింగ్ నాగార్జున వెయ్యి ఎక‌రాల రిజ‌ర్వు ఫారెస్ట్ ద‌త్త‌త తీసుకుంటాన‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయం వెనుక నాగార్జున అభిరుచి ఉందా ? లేక, మరో కారణం అయినా ఏమైనా ఉందా ? అని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

    Nagarjuna

    నాగార్జున అయితే, తాను ద‌త్త‌త తీసుకోవడం పై మాట్లాడుతూ .. ‘ఈ ఏడాది ముగిసిపోవడానికి ఇంకా 3 వారాల సమయం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్నో చేసుంటాం కానీ, ఈ 3 వారాలు.. వారానికొకటి చొప్పున 3 మొక్కలు నాటి 2021కి మంచి ఫినిషింగ్ ఇవ్వాలి. భూతాపాన్ని నివారించి, భూమిపై భ‌విష్య‌త్ త‌రాలు మ‌నుగ‌డ సాగించాలంటే మొక్క‌లు నాట‌డం ఒక్క‌టే మార్గం.

    ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” నన్నెంతగానో కదిలించాయి. తానూ ఎంపీ చూపిన చోట రిజ‌ర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకొని పెంచుతాను.. సమాజం పట్ల నా వంతు బాధ్యత నిర్వర్తిస్తాను. జోగినిపల్లి సంతోష్ కుమార్ అందించిన మొక్కను బిగ్ బాస్ హౌస్ లో నాటి వారి స్పూర్తిని కొనసాగిస్తామని ప్రకటించారు నాగార్జున.

    Also Read: HBD Victory Venkatesh: నైజాం రాజుగా ఎంట్రీ ఇచ్చిన వెంకీమామ.. స్పెషల్​ బర్త్​డే వీడియో రిలీజ్​

    మరి నాగార్జున మాటలను బట్టి.. కేవలం జోగినిపల్లి సంతోష్ కుమార్ స్పూర్తి మాత్రమే ఉందా ? లేక, హైదరాబాద్ లోని తన ల్యాండ్స్ ను కాపాడుకోవడానికి గవర్న్ మెంట్ ని మంచి చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడా అనేది చూడాలి.

    Also Read: Rashmika: బ్లాక్​ శారీ హాట్​ లుక్స్​తో కవ్విస్తోన్న రష్మిక.. నెట్టింట్లో పిక్స్ వైరల్​

    Tags